ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్‌లాండ్: లిస్ట్‌లో ఇండియా ర్యాంక్ ఏంతంటే..?

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది.

మార్చి 20 శుక్రవారం వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది.

ప్రపంచంలోని 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి, అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి ఈ జాబితాను రూపొందించింది.జీడీపీ, సామాజిక మద్ధతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి వంటి అంశాల్లో ఫిన్‌లాండ్ నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచింది.

సంతోషకర నగరాల జాబితాలో ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీ మొదటి స్థానంలో నిలిచింది.ఈ దేశంలో ఉండే విస్తారమైన అడవులు, వేలాది సరస్సులు కారణంగా ఫిన్‌లాండ్ ప్రజలు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేందుకు ఉపకరిస్తున్నాయని తెలిసింది.

ఇక ఈ లిస్ట్‌లో భారతదేశం సంగతికి వస్తే.సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.అలాగే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో ఢిల్లీ 7వ స్థానంలో నిలిచింది.

Advertisement

అతి వక్కువ సంతోషకర నగరాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మొదటి స్థానంలో నిలిచింది.ఆఫ్రికా దేశాలు జింబాబ్వే, దక్షిణ సూడాన్.మన పక్కదేశం ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచంలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో స్థానం సంపాదించాయి.

గతేడాది ప్రకటించిన జాబితాలో భారత్ 133వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు