వాట్సాప్‌లో నయా మోసాలు.. ఇలా అస్సలు చేయకండి!

ప్రస్తుత సమయంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే ఏ పని కాదు.ఇప్పుడు మనం పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడ్డాం.

ఫోన్‌ లేనిదే.ఏ పని చేయలేం.

పూర్తిగా దీనికి అలవాటు పడిపోయాం.అందుకే అంత పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంటుంన్నాం.

ప్రతిరోజూ ఎదో ఒక మోసం జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా టెక్నాలజీపైన అవగాహన లేనివారు ఎక్కువ శాతం మోసపోతున్నారు.

Advertisement

వారి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.కేవలం హ్యాకింగ్‌ ద్వారానే డబ్బులు కొల్లగొట్టే నేరగాళ్లు ప్రస్తుతం వాట్సాప్‌తో కూడా అమాయకులను మోసగిస్తున్నారు.

ఈ నయా పంథాలో.ముఖ్యంగా నకిలీ లింకులను పంపిస్తూ.

దాని వల్ల సమాచారాన్ని పొంది, బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు.ఇటీవల అమెజాన్‌ వార్షికోత్సవం పేరుతో ఓ నయా మోసం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో బహుమతులు పొందవచ్చని నమ్మించారు.

ఒక సర్వేలో పాల్గొనాల్సి ఉంటందని వాట్సాప్‌ లింక్‌ పంపించి.అప్పుడు వారి పని పూర్తి చేసేస్తారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అలాగే ఈ లింకును ఐదు వాట్సాప్‌ గ్రూపుల్లో లేదా 20 మంది స్నేహితులకు షేర్‌ చేయమంటారు.ఇంకా.

Advertisement

ఒక యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసి, అందులో అడ్రస్‌ నమోదు చేయమని చెబుతుంది.వినియోగదారులు గెల్చుకున్న బహుమతిని, వారి అడ్రస్‌కు వారం రోజుల్లో పంపిస్తామని నోటిఫికేషన్‌ వస్తుంది.

ఈ విధంగా నకిలీ వెబ్‌సైట్లతో వినియోగదారుల డేటాను సేకరించి, దాని ద్వారా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.లేకపోతే కస్టమర్ల డేటాను ఇతర ప్రైవేటు సాప్ట్‌వేర్లకు విక్రయిస్తుంది.

యూజర్ల డివైజ్‌లో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి సైతం హ్యాకర్లు ఈ లింక్‌లను ఉపయోగించవచ్చు.

దీంతో మీ డేటా చోరీ అవ్వడంతోపాటు ఆర్థిక మోసానికి దారితీస్తుంది.అందువల్ల వాట్సాప్‌ మెస్సేజ్‌ల ద్వారా పంపే లింకుల నుంచి ఎలాంటి యాప్స్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.ఈ మోసాన్ని గుర్తించడానికి కాసేపు ఆ నకిలీ లింక్‌ను పరిశీలిస్తే అది నిజమో! కాదో.

తెలిసిపోతుంది.వారు పంపిన లింక్‌ అడ్రస్‌ అసలైన సైట్‌ మాదిరి స్కామర్లు తయారు చేస్తారు.

కానీ, యూఆర్‌ఎల్‌తో సంబంధం లేకుండా.తెలియని ఫోన్‌ నంబర్ల ద్వారా వచ్చే లింక్‌లను సాధ్యమైనంత వరకు క్లిక్‌ చేయకూడదు.

అది ఇతరులకు షేర్‌ చేయడం వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది.ఇక ఎటువంటి ఫేక్‌ లింక్‌లు వచ్చినా తస్మాత్‌ జాగ్రత్త!.

తాజా వార్తలు