Aparichithudu : న్యూస్ పేపర్ లో వచ్చిన ఘటన కి, అపరిచితుడు సినిమాకు ఉన్న సంబంధం ఏమిటి?

ప్రతిరోజు లాగే ఆరోజు కూడా దర్శకుడు శంకర్( Director Shankar ) ఇంటికి డైలీ న్యూస్ పేపర్ వచ్చింది.

అందులో ఒక వార్త దగ్గర అతడి కళ్ళు ఆగిపోయాయి.

అసలే దర్శకుడు అలాంటి ఒక దర్శకుడి కంటికి మంచి క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ స్టోరీని తలపించే ఒక విషయం దొరికితే ఊరకనే ఉంటారా.? దర్శకుడు శంకర్ కూడా ఊరుకోలేదు తన ఆస్థాన రచయిత అయిన సుజాత కు ఇచ్చి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పారు.సుజాత( Sujata ) గారు సైతం గతంలో మంచి థ్రిల్లర్ నవల రచయిత ఆ తర్వాత సినిమా రచయితగా మారారు శంకర్ సినిమాలకు ఆ సుజాత గారే ఆస్థాన రచయిత.

ఇక అసలే థ్రిల్లర్ జోనల్ దాంతో వచ్చిన ఆ న్యూస్ నీ ఆధారం చేసుకుని చక చకా స్క్రిప్ట్ రాసి దర్శకుడు శంకర్ చేతిలో పెట్టారు.

Facts Behind Aparichithudu Movie

ఇంతకీ శంకర్ ఆకర్షించిన ఆ వార్త ఏంటో తెలుసా? అదేంటంటే మధురైలో జరిగిన ఒక సంఘటన కరుడుగట్టిన ఒక నేరస్తుడిని ఎలాగైనా పట్టుకోవాలని ఉద్దేశంతో ఒక పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఏకంగా 40 రోజులపాటు భిక్షాటన చేస్తూ ప్రత్యేక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు.అలా భిక్షాటన చేస్తూ మాటు వేసి ఆ నేరస్తుని పట్టుకున్నాడు ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్ గా అనిపించింది ఈ శంకర్ కి.ఈ వార్త విన్న తర్వాత ఎవరైనా కూడా ఎంతో థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు.శంకర్ కూడా అలాగే చేశాడు ఆ కథను సినిమాగా మలచాలనుకున్నాడు.

Advertisement
Facts Behind Aparichithudu Movie-Aparichithudu : న్యూస్ పేప�

అందుకోసం సుజాత గారు రాసిన స్క్రిప్ట్ తో ఒక చిత్రం కూడా తీశారు అదే అన్నియన్( తెలుగులో అపరిచితుడు).

Facts Behind Aparichithudu Movie

ఈ అండర్ కవర్ ఆపరేషన్ ఎపిసోడ్ ఇన్స్పిరేషన్ తో అపరిచితుడు సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) మరియు వివేక్( Vivek ) పాత్రలను సృష్టించాడు శంకర్.సీరియస్ గా అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ విబిన్నమైన రీతిలో హత్యలను చేస్తున్న హీరోను పట్టుకోవడానికి ప్రకాష్ రాజ్ ప్రయత్నించిన తీరు, అలాగే వివేక్ కామెడీ కూడా జత కావడంతో అద్భుతంగా పండింది.ఒక సీరియస్ క్రైమ్ కి కామెడీ కూడా జోడైనప్పటికీ ఎలాంటి వెగటు పుట్టించకుండా మంచి సినిమా తయారయ్యింది.

అన్నియన్ అంటే అసమాన్యుడు అని అర్థం.కానీ తెలుగులో ఆ అర్థం వచ్చే విధంగా కాకుండా అపరిచితుడు అని మార్చి విడుదల చేయడం జరిగింది.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు