సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరిచే నాగసర్ప దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..?

సాధారణంగా మనదేశంలో ఆలయాలన్నీ ఉదయం తెరిచి సాయంత్రం మూసివేస్తారు.రోజంతా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

ఏదైనా పండుగ సమయాలలో స్వామివారిని రాత్రంతా కూడా భక్తులకు అందుబాటులో స్వామివారి దర్శనం కల్పిస్తారు.మరికొన్ని ఆలయాలు ఆరు నెలలపాటు మూసి ఉంటే ఆరు నెలల పాటు తెరిచి ఉంటారు.

ఈ విధంగా మనదేశంలో అన్ని ఆలయాలు భక్తులకు దర్శనం కల్పిస్తుంటే ఒకే ఒక ఆలయంలో మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరచుకుని భక్తులకు దర్శనం కల్పిస్తారు.మరి ఆలయం ఎక్కడ ఉంది ఆలయ రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మన హిందూ ఆచారాల ప్రకారం సర్పాలను దేవుడిగా భావించి పలుచోట్ల ఆలయాలను నిర్మించి పూజలు చేస్తున్నారు.ఈ విధమైనటువంటి ఆలయాలలో ఒకటే ఉజ్జయిని మహదేవ్ ఆలయం.

Advertisement
Facts About Naga Chandreshwar Templ Naga Chandreshwar, Hindu Customs, Lard Shiva

ఈ ఆలయంలోని మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరాలయం కొలువై ఉంది.ఆ ఆలయం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే తెరుస్తారు.

ఈ ఆలయం కేవలం శ్రావణ మాసం శుక్ల పంచమి రోజున మాత్రమే తెరచి ఉంటుంది.ఈ ఆలయంలో స్వామివారు మనకు పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకుని కూర్చొన్న శివపార్వతులుంటారు.

Facts About Naga Chandreshwar Templ Naga Chandreshwar, Hindu Customs, Lard Shiva

ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతిమ మన దేశంలో మరెక్కడా కూడా లేదు మామూలుగా అయితే సర్పము పై విష్ణుదేవుడు దర్శనం ఇస్తాడు కానీ ఈ ఆలయంలో మాత్రం శివుడు మనకు దర్శనం కల్పిస్తారు.శివుడు పాము పై దర్శనం ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది.పురాణాల ప్రకారం సర్పరాజు తక్షకుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం కఠిన తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడు.

అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెబుతారు.అప్పటికి శివుడికి నంది వాహనంగా ఉన్న కారణంగా తక్షకుడితో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే శాయనిస్తానని చెబుతాడు.పరమేశ్వరుడు తక్షకుడి పై కూర్చొన్న స్థితిలో కనిపిస్తాడు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

కానీ నాగపంచమి రోజున అంటే శ్రవణ శుక్ల పంచమి రోజు నీ పై కుర్చోవడమే కాకుండ శయనిస్తానని చెబుతాడు.సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

Advertisement

ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తులు భావిస్తారు.

తాజా వార్తలు