త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడని ,లయకారుడు అని పిలుస్తారు.త్రిమూర్తులలో చివరివాడైన పరమేశ్వరుడిని దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తిశ్రద్ధలతో విశేష పూజలను అందుకుంటూ ఉన్నారు.
అయితే పురాణాల ప్రకారం మనకు పరమేశ్వరుడికి కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప ముగ్గురు పరమేశ్వరుడి కొడుకులుగా చెబుతారు.అయితే ఈ ముగ్గురు కూడా విశేషమైన పూజలను అందుకుంటున్నారు.
కానీ పరమేశ్వరుడికి కేవలం కొడుకులు మాత్రమే కాకుండా కూతుర్లు కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు.అయితే పరమేశ్వరుడి కూతుర్లు ఎవరు వారి జన్మ రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.
అశోక సుందరి:
పార్వతీ దేవి తన ఒంటరితనాన్ని భరించలేక అశోక సుందరిని సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి.అశోక అంటే పార్వతీదేవి బాధ, సుందరి అంటే అందమైనది అని అర్థం.పార్వతీదేవి ఒంటరిగా ఉన్నప్పుడు తన బాధలను పోగొట్టడానికి అశోక సుందరి సృష్టించిందని పద్మపురాణం చెబుతోంది.అయితే పరమేశ్వరుడు వినాయకుడి తల నరికినప్పుడు అది చూసిన అశోక సుందరి భయంతో వెళ్లి ఉప్పులో దాక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.
జ్యోతి:
జ్యోతి శివుడి తలలో ఉన్న నెలవంక, పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపునుంచి ఉద్భవించిందని పురాణ కథలు చెబుతున్నాయి.జ్యోతిని హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.అందుకే ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజా సమయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేయడం ఆనవాయితీగా వస్తోంది.శివుడు, పార్వతి శారీరక వ్యక్తీకరణ ద్వారా జ్యోతి జన్మించింది.
మానస:
మానస కూడా శివుడి పుత్రికనే.అయితే ఈమె శివుడు పార్వతిల సంతానం కాదు.శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలటం వల్ల మానస జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి.
అందుకోసమే ఈమెను శివ పుత్రిక అని మాత్రమే పిలుస్తారు.ఈ విధంగా శివుడికి కూడా ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
అయితే వీరిని కేవలం కొన్ని ప్రాంతాలలో వారు మాత్రమే పూజిస్తారు.