తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ...!

నల్లగొండ జిల్లా:ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ( Congress party ) కసరత్తు చేస్తోన్నది.

పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది.

దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకాశం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది.ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడుతున్నారు.

దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడుతుందా? ఒక్కరినే పోటీలో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది.ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.

తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్( BRS party ) ధీమా ను వ్యక్తం చేస్తున్నది.అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెలవడం కష్టమే.కానీ, ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీలను సొంతం చేసుకోవచ్చు.

ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాఫిక్ గా మారింది.

సీఎం రేవంత్( CM Revanth reddy ) ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికపై క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇక ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్లనున్నారు.

ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి,తర్వాతి ప్రాసెస్ బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!
Advertisement

Latest Nalgonda News