అమెరికా : హెచ్ 1 బీ వీసాల సంఖ్య పెంచాల్సిందే.. కారణాలతో సహా చెప్పిన మాజీ కాంగ్రెస్ సభ్యురాలు

నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

 Ex Us Lawmaker Underlines Dire Need To Expand H-1b Visa Programme Amid Inflation-TeluguStop.com

వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

కాలం చెల్లిన హెచ్ 1 బీ వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతులైన భారతీయులు కెనడా వంటి దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు గతేడాది అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు.ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్, శాశ్వత నివాస వీసా జారీ చేయడానికి అమల్లో వున్న కంట్రీ క్యాప్ విధానం ఇందుకు ప్రధాన కారణమని వారు తెలిపారు.భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడాకు తరలి వెళ్లకుండా నిరోధించడానికి కాంగ్రెస్ మరింత వేగంగా పనిచేయాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు.90వ దశకం తర్వాత ప్రపంచం మారినట్లుగా.యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానం మారలేదని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ కాంగ్రెస్‌కు తెలిపారు.

Telugu American, Lawmaker, Lawmakerdire, Green, Visa-Telugu NRI

తాజాగా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మియా లవ్ సైతం అమెరికన్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోని అనిశ్చిత పరిస్ధితుల దృష్ట్యా.హెచ్ 1 బీ వీసా పరిమితిని పెంచాల్సిన అవసరం వుందని ఆమె అభిప్రాయపడ్డారు.అమెరికా ఆర్థిక అభివృద్ధిలో విదేశీ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని.కానీ గడిచిన 20 ఏళ్లుగా ఏటా 85 వేల హెచ్ 1బీ వీసాలను మాత్రమే ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోందని మియా లవ్ మండిపడ్డారు.దీని వల్ల పెద్ద సంఖ్యలో నిపుణులు అమెరికాకు తరలివస్తారని .తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని పలు నివేదికలు కూడా చెబుతున్నట్టు మియా లవ్ యూఎస్ సెనేట్‌ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube