రసమయి బాలకిషన్ అబద్దాల కొరు - మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జీపూర్ గ్రామంలో మంగళవారం రోజున మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు.

గ్రామపంచాయతీ భవనం, మహిళాశక్తి భవనం, యాదవ సంఘం కాంగ్రెస్ పార్టీ హయాములోనే నిర్మాణం అయ్యాయని అన్నారు.మొన్నటి ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి మాట్లాడినవి అన్ని పచ్చి అబద్ధాలే అని ఆయన అన్నారు.

వెల్జీపూర్ లో ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ రాలేదని,రసమయి తన స్థాయి మరచి ఒంటెత్తు పోకడలతో వెళుతున్నారని,ఈ సారి రసమయిని ఓడించి తీరుతామని అన్నారు.గతంలో తాను చేసిన అభివృద్ధి పనులకు రసమయి దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని,బిల్లులు రాలేక అప్పుల పాలు అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

1500 సార్లు ప్రసారమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ... అంత క్రేజ్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?
Advertisement

Latest Rajanna Sircilla News