యుద్ద ప్రాతిపదికన వర్షాభావ విపత్తు నష్టాలను అంచనా వేయండి

యుద్ద ప్రాతిపదికన వర్షాభావ విపత్తు నష్టాలను అంచనా వేయండి ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్, వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్ అధికారులకు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ఆదేశం.

ప్రజలకు త్వరితగతిన సౌకర్యాలు కల్పిద్దాం.

నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం.నష్ట నివేదికలను జిల్లా కలెక్టర్ కి, జిల్లా మంత్రి కి, ముఖ్య మంత్రి కి అంద చేస్తాం.

విపత్తులో ప్రాణాలకు తెగించి కాపాడిన యువకులకు అభినందనలు.వర్షాభావ ప్రాంతాలలో నేడు భీమారం మండలంలో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ( Chennamaneni Ramesh )పర్యటన.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు భీమారం మండలం రాజ లింగంపేట గ్రామంలోని కోతకు గురైన గోవిందరాజుల చెరువును, నీట మునిగిన ఎస్సీ కాలనీని, పూర్తిగా ద్వంసమైన కోళ్ల షేడ్డును సందర్శించారు.చనిపోయిన కోళ్ల నష్ట పరిహారం కొరకు అధికారులతో మాట్లాడతానని అన్నారు.

Advertisement

కోళ్ల షెడ్డులో వున్న ప్రజలను ప్రాణాలకు తెగించి రక్షించిన యువకులను ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ యువకులను సన్మానించారు.గోవిందారం వొడ్డెర కాలనీని, దేశాయ్ పేటలో పాడైన కల్వర్టును, వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల విపత్తు కారణంగా పంట నష్టం, రహదారులు కొట్టుకుపోవడం, ఒర్రెలు, వాగులు, చెరువులు, వంతెనలు తెగిపోవడం వల్ల ఇండ్లు దెబ్బతినడం జరిగిందని అన్నారు.ఈ నష్టం గురించి జిల్లా కలెక్టర్ మంత్రి కి వివరించామని రైతులు, ప్రజలు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామని అన్నారు.

అన్ని పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు, రైతులకు అండగా నిలవాలని అన్నారు.విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని జరిగిన నష్టాన్ని తెలియజేయాలని అన్నారు.

ప్రభుత్వానికి కూడా సమాచారం అందుతున్నదని, ప్రభుత్వం ఎప్పుడు రైతులు పక్షాన వుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఓద్దినేని హరిచరణ్ రావు, జగిత్యాల జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా మెంబెర్ శ్రీపాల్ రెడ్డి, వైస్ ఎం.పీ.పీ డి.శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు సత్తి రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ ఉద్ గిరి రమ్య, ఫాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎం.పి.టి.సీలు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News