తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది.మరి కొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనుంది.
ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం గడువు ముగిస్తుంది.
ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుంది.
ఈ క్రమంలో స్థానికేతరులు అంతా రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు చివరి రోజు కావడంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.వరుసగా సభలు, సమావేశాలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా ప్రచారం క్లైమాక్స్ కు చేరిన నేపథ్యంలో పార్టీలన్నీ పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టనున్నాయని తెలుస్తోంది.ఈనెల 29, 30 తేదీల్లో భారీగా మద్యం, డబ్బులు పంపిణీ జరిగే అవకాశం ఎన్నికల సంఘం అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలోనే నియోజకవర్గాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది.ఇప్పటికే ఈసీ నిఘా బృందాలు, ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగారు.
ఇక ఎల్లుండి తెలంగాణలో పోలింగ్ జరగనుంది.