స్వచ్ఛమైన నీటిని అందించేలా కృషి చేయాలి:ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈ వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా:గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్.డబ్ల్యూ.

ఎస్ డీఈ వెంకటరెడ్డి అన్నారు.బుధవారం నల్గొండ జిల్లా ( Nalgonda District )వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మిషన్ భగీరథ (Mission Bhagiratha )ఆధ్వర్యంలో వేములపల్లి, మాడుగులపల్లి మండలాల గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణా శిబిరంలో ఎంపీడీవో శారదాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి సరఫరా చేసే సమయంలో సహాయకులు క్షేత్రస్థాయిలో పైప్లైన్ల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించాలని,ఎక్కడ నీటి సరఫరాలో లీకులు లేకుండా చూసుకోవాలన్నారు.కలుషిత నీటిని ప్రజలకు అందించినట్లయితే అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉందనే విషయాన్ని గమనించి, ఎప్పటికప్పుడు జాగ్రతలు తీసుకోవాలని,విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు.

ఎప్పటికప్పుడు నీటి శాంపిల్స్ సేకరించి ప్రయోగశాలకు పంపించి నీటి నాణ్యతను పరిశీలించుకోవలసిన బాధ్యత నీటి సహాయకులపై ఉందన్నారు.ఈ శిక్షణ తరగతుల ద్వారా గ్రామాల్లో మంచినీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీ,మరమ్మత్తులు, సింగిల్ ఫేస్,త్రి ఫేస్ మోటార్ల రిపేర్,చేతి పంపుల రిపేర్,నీటి నాణ్యత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ నీటి సహాయకులకు,మిషన్ భగీరథ సిబ్బందికి సూచించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి ఎంపీడీవో సంగీత,ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు గంగాభవాని, దినేష్,నీటి నాణ్యత శిక్షకులు వీరారెడ్డి, క్రాంతికుమార్,బ్రహ్మచారి, గ్రామ మంచినీటి సహాయకులు,మిషన్ భగీరథ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

రచ్చ గెలిచి ఇంట గెలవలేదుగా.. ఎన్టీఆర్, బన్నీలకు ఒకే సమస్య ఎదురైందా?
Advertisement

Latest Nalgonda News