మాజీ నక్సలైట్ల మంటూ బెదిరిస్తున్న ఇద్దరిని బైండోవర్ చేసిన వేములవాడ DSP నాగేంద్రచారి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాజీ నక్సలైట్ల మని చెప్పుకుంటూ, భూవివాదాల్లో తల దురుస్తూ, పంచాయతీలు చేస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, ఇబ్బందికి గురి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బొద్దు నారాయణ నూకలమర్రి, జంగిటి బాబు సాయి నగర్ వేములవాడ అను వారిపై గతంలో కేసులు అయ్యాయని, అయినా మారకుండా భూమి దందాలు చేస్తూన్నారు.

వీరికి భయపడి ఎవరు దరఖాస్తు ఇవ్వనందున మంచి ప్రవర్తనకై 6 నెలలు ఎమ్మార్వో ముందు బైండోవర్ చేయడమైనది తెలిపిన డి.

ఎస్.పి .ఇంకా ఎవరైనా వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో భూ వివాదపు బాధితులు ఉన్నట్లయితే 8712656412 మొబైల్ కు ఫోన్ చేసి చెప్పవచ్చు అని వేములవాడ డిఎస్పి కే.నాగేంద్ర చారి కీ సమాచార ఇవ్వవచ్చు అని తెలిపారు.

Latest Rajanna Sircilla News