బలగం సినిమా లో సర్పంచ్ గా నటించిన కీసరి నర్సింగంను సత్కరించిన డాక్టర్ గోలి మోహన్!

రాజన్న సిరిసిల్ల జిల్లా :బలగం సినిమా లో సర్పంచ్ గా నటించిన కీసరి నర్సింగం నుసత్కరించిన డాక్టర్ గోలి మోహన్.

ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ ఒకప్పుడు తెలంగాణ యాస భాష చూసి హేళన చేసిన వాళ్లు, సినిమా పరిశ్రమలో ఎలాంటి స్థానం ఇవ్వనివారు, ఈరోజు అదే తెలంగాణ యాస భాషతో చిత్రాలు నిర్మిస్తూ ఎంతో సంపాదిస్తున్నారు.

ఈరోజు ఒక కుటుంబం, ఒక బంధం, ఒక అనుబంధం వేరవుతున్న సందర్భంలో బలగం అనే సినిమా తీసిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక కమెడియన్ గా జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకొని ఏదైనా సాధించాలన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయని వాటిని అధిగమించినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటామని నిరూపించిన మన తెలంగాణ ముద్దుబిడ్డ ఎల్దండివేణు డైరెక్టర్ గా పరిచయమైన బలగం సినిమా ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం చాలా గర్వకారణం అని అలాంటి సినిమాలు ఒక సర్పంచ్ పాత్ర పోషించిన కీసరి నర్సింహం ఒక కళాకారుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఈరోజు బలగం సినిమాలో సర్పంచ్ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించి గ్రామీణ వాతావరణం లోని ప్రజల మనోభావాలను కళ్ళకు అద్దం పట్టినట్టుగా చూపించి, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు విడిపోవడం చిన్న చిన్న మనస్పర్దాలతో దూరం అవ్వడం ఇలాంటి సన్నివేశాలు ఎంతోమంది ని కంటతడి పెట్టించాయని ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయని డాక్టర్ గోలి మోహన్ శాలువాతో సత్కరించి మీరు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరారు.ఇలాంటి కళాకారులను ప్రభుత్వాలు గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చి వెండితెరపై తీసుకురావాలని, తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర గొప్పదని అలాంటి వారికి ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలోని కళాకారులతో ఒక సమావేశం పెట్టి వారికున్న సమస్యలపై ఒక అవగాహన ఏర్పరచుకొని వారికి అన్ని విధాల తోడ్పాటు అందించే విధంగా సహకరిస్తానని తెలియజేశారు.బలగం సినిమా లో నటించిన నర్సింగం మాట్లాడుతూ మాలాంటి వారిని ప్రోత్సహించి ఈరోజు నన్ను సత్కరించినందుకు చాలా సంతోషమని మీలాంటి వాళ్ళు ఈ నియోజకవర్గానికి నాయకులుగా ఉంటే నాలాంటి కళాకారులకు ఆదరణ లభిస్తుందని, ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు కి,దిల్ రాజు కి ఈ చిత్రం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా... ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!
Advertisement

Latest Rajanna Sircilla News