ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట.. కానీ 100 కోట్ల లాభం...

ఇటీవలే మలయాళ భాషలో ప్రముఖ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన "డాక్టర్" చిత్రం విడుదలైన సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఈ చిత్రానికి తమిళ ప్రముఖ నూతన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీత స్వరాలు సమకూర్చాడు.

అయితే ఈ చిత్రంలో హీరో శివ కార్తికేయన్ కి జంటగా శ్రీకారం ప్రియాంక అరుల్ మోహన్ నటించింది.దీంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.

అయితే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకొని దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ విడుదల కోసం బాగానే వెయిట్ చేసింది.కానీ సినిమా థియేటర్లలో విడుదల చేయడంతో దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.

దీంతో తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయం గురించి స్పందించారు.ఇందులో భాగంగా ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు కరోనా మొదటి వేవ్ కంటే ముందుగా పూర్తయ్యాయని కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపి వేశామని చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ తర్వాత సంవత్సర కాలం తర్వాత సినిమా థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ సెకండ్ వేవ్ వచ్చి మరింత ఆలస్యం చేసిందని ఈ క్రమంలో పలు ఓటీటీ సంస్థలు కోట్ల రూపాయల డబ్బు ఆఫర్ చేసి కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారని దాంతో నిర్మాతలు కూడా కొంతమేర ఓటిటిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సంఘీభావం తెలిపారట.కానీ చివరి నిమిషంలో హీరో శివ కార్తికేయన్ మరియు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలగజేసుకుని ఏదేమైనప్పటికీ సినిమా థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పట్టుబట్టడంతో ఓటిటి విడుదల నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.

కానీ ఈ చిత్రం విడుదలై నెల రోజులు దాటి పోయినప్పటికీ ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.అయితే మామూలుగా ఇతర భాషా చిత్రాలలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని అందరికీ బాగా తెలుసు.దీంతో డాక్టర్ విషయంలో కూడా అదే జరిగింది.

అలాగే కరోనా వైరస్ సెకండ్ వేవ్ దాటుకొని సినిమాని విడుదల చేయడంతో దర్శక నిర్మాతలకు మంచి కాసుల పంట పండింది.దీంతో ప్రస్తుతం శివ కార్తికేయన్ తెలుగులో హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు