నెం. 786 సంఖ్యని మహమ్మదీయులు ఎందుకు ఆరాధిస్తారో తెలుసా?

మీరు గమనిస్తే, చాలాచోట్ల 786 అనే నెంబర్ కనిపిస్తూవుంటుంది.స్కూటర్, లారీ, కార్ ఇలా అనేక వాహనాలపైన ఈ నెంబర్ ని చూడవచ్చు.

 Do You Know Why Muslims Worship The Number 786 Muslim, 786, Reason, Latest News-TeluguStop.com

కొంతమందైతే ఈ నెంబర్ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి మరీ సొంతం చేసుకుంటారు.మరికొంతమైంది తమ మొబైల్ నెంబరులో ఈ త్రీ డిజిట్స్ ఉన్నట్టు చూసుకుంటారు.

ఫ్యాన్సీ నెంబర్లో భాగంగా దీనికోసం వారు కూడా భారీమొత్తంలో చెల్లిస్తారు.అయితే ఈ సంఖ్యకు వున్న ప్రాధాన్యం ఏ కొద్దిమందికో తెలుసు.

ముఖ్యంగా దీన్ని మహమ్మదీయుల మందిరాలలో మనం చూడవచ్చును.

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ‘786’ సంఖ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

కావున ఈ రంజాన్ సందర్భంగా ఈ సంఖ్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.వీరు తమ దైవంగా భావించే ‘అల్లా‘ని దయగలవాడు మరియు కరుణామయుడు అని కొలుస్తూ వుంటారు.ఈ నమ్మకానికి ప్రతీక మనం చెప్పుకుంటున్న ఈ 786 సంఖ్య.అవును… ‘అబ్జాద్‘ అని పిలువబడే పురాతన అరబిక్ సంఖ్యాశాస్త్రం ప్రకారం.ఈ సంఖ్య ఉద్భవించిందని తార్కికులు చెబుతున్నారు.అబ్జాద్ సంఖ్యాశాస్త్రం ప్రకారం, 5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ బాషలో మొత్తం 28 అక్షరాలుంటాయని, ఆ భాషలో ఒక్కక అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఇవ్వడం జరిగిందని, ఆవిధంగా ఇవ్వబడిన నెంబర్స్ ప్రకారం ఈ 786 పుట్టిందని వారి ప్రగాఢ నమ్మకం మరియు విశ్వాసం.

Telugu Latest-Latest News - Telugu

వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రారంభంలో ‘బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్‘ అని ఉంటుంది.ఈ పవిత్ర వాక్యం రాయడానికి ఉపయోగించే అక్షరాల విలువలను కలిపితే ఈ 786 సంఖ్య వస్తుంది.ఇంతటి గొప్ప పవితమైన సంఖ్యకు ప్రపంచదేశాల్లో చాలా ప్రాధాన్యత ఉంది.ఇందులో కూడా ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏసియాలోనే మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది.ఈ సంఖ్య సీరియల్ అంకె ఉన్న డబ్బు నోట్లకు కూడా మంచి గిరాకి ఉందంటే అర్ధం చేసుకోండి మరి.అప్పుడప్పుడు ఈ సంఖ్య ఉన్న నోట్లకోసం కొంతమంది భారీమొత్తంలో వెచ్చించి మరీ సొంతం చేసుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube