ఉద్దాలక మహర్షి అతని భార్య చండిక జైమిని వృత్తాంతం ఏమిటి?

ఉద్దాలకుడు ఒక విప్రుడు.ఇతని భార్య పేరు చండిక.

ఆమె మిక్కిలి గయ్యాళి.

భర్త చెప్పిన మాటకు విరుద్ధంగా చేయడం ఆమె స్వభావం.

Do You Know Uddhalaka Maharshi And His Wife Chandika Jaimini Chandika Jaimini

అందు వల్ల అతనికి సంసారంలో సుఖ శాంతులు కరువయ్యాయి.ఒక నాడు తన దురవస్థను అతడు కౌండిన్య మునితో చెప్పుకొన్నాడు.

ఆ ముని అతనితో నీవు చెప్పినదానికి ఆమె విరుద్ధంగా చేస్తున్నదంటున్నావు.సరే ఇప్పటి నుండి నీవు నీకు ఏమి కావాలో దానికి విరుద్ధంగా ఆమెతో చెప్పడం అలవాటు చేసుకో, నీ పని నెరవేరుతుంది అని చెప్పాడు.

Advertisement

ఈ ఉపాయం బాగా పని చేసింది.ఉద్దాలకుడు తన అభీష్టానికి విరుద్ధంగా మాట్లాడుతూ భార్య చేత తన పని చేయించుకునేవాడు.

ఒక నాడు పితృ కార్యం చేయవలసి వచ్చింది.నీవు అశుచివై వంట చేయాలి అని అతడు భార్యతో అన్నాడు.

ఆమె చాలా శుచిగా వుండి వంట చేసింది.బ్రాహ్మణులకు నీవు అన్నం వడ్డించ వద్దు అని అతడు చెప్పగా ఆమె ఎంతో శ్రద్ధగా వారికి వడ్డనలు కావించింది.

అతడు లోలోన సంతోషించేవాడు.ఒకనాడు సంతోషాతిశయంతో అసలు సంగతి మరచి ఇక్కడ పారణ మున్నది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

జాగ్రత్తగా తీసి పెట్టు అని చెప్పాడు.దానిని ఆమె వెంటనే పెంట కుప్పపై పారేసింది.

Advertisement

అందుకు కోపించి ఆ విప్రుడు వింధ్వ పర్వతంలో శిలవై పడి వుండు అని భార్యను శపించాడు.ధర్మజుని యాగాశ్వం ఆశిలను త్రొక్కినప్పుడు నీకు శాప విముక్తి కల్గుతుంది.

అని కూడా అన్నాడు.ఈ కథను జైమిని భారతంలో చూడవచ్చు.

తాజా వార్తలు