అరటి ఆకులలో ఏ విధంగా వడ్డించాలో మీకు తెలుసా?

అరటి ఆకులలో భోజనం చేయడం మన భారతీయ సంప్రదాయాలలో ఒక భాగంగా ఉండేది.

పూర్వకాలం బ్రాహ్మణులు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి అరటి ఆకులలో భోజనం పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది.

ప్రస్తుతం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా వ్రతాలు నిర్వహించినప్పుడు ఈ అరిటాకులను వాడడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది.అరిటాకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలిసిందే.

అయితే అరిటాకులలో ఏ విధంగా వడ్డించాలి? ముందు ఏ ఆహార పదార్థాలను వడ్డించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.అన్నం తినడం అనేది కేవలం కడుపు నింపుకోవడం కోసం అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన ఆహారాన్ని పరమ పవిత్రమైనదిగా భావించాలి.ఇంతటి పవిత్రమైన ఆహారాన్ని తినాలి అంటే కొన్ని నియమాలను పాటించాలి.

Advertisement

ముఖ్యంగా అరటి ఆకులో భోజనం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వేద పండితులు చెబుతున్నారు.అరటి ఆకులు వేసేటప్పుడు ఆకుకి ఉన్న ఈనె తొలగించ కూడదు.

ఈ ఈనె ఎప్పుడు ఆకు ఎడమ భాగం వైపు ఉండేలా చూసుకోవాలి.ఆకు కుడి వైపు భాగంలో పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాలను వడ్డించాలి.

తరువాత ఆకు ఎదురుగా కూరలు, మధ్యలో అన్నం వడ్డించాలి.కుడివైపు పాయసంతో పాటు, పప్పును కూడా వేయాలి.

ఎడమవైపు మిగతా పిండి వంటలు,చారు, చివరిగా పెరుగును వడ్డించాలి.ఇవి అరటి ఆకులలో భోజనం చేసేటప్పుడు వడ్డించాల్సిన నియమాలు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?

ఎప్పుడు కూడా ఆహారం వడ్డించక ముందు ఉప్పును వేయకూడదు.అంతేకాకుండా ఉప్పు ఒక్కదానిని మాత్రమే ప్రత్యేకంగా వడ్డించకూడదు.ఆహారం తిన్న తరువాత నెయ్యి ,పాయసాన్ని అసలు వేసుకోకూడదు.

Advertisement

ఏదైనా తీపి పదార్థాన్ని ఆహారం తినకముందే వడ్డించుకోవాలి.అంతేకాకుండా అమావాస్య, పౌర్ణమి రోజులలో రాత్రిపూట అరటి ఆకులపై భోజనం చేయరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు