మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని దశలు ఉంటాయో తెలుసా?

సాధారణంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తనకు సంబంధించిన 16 కార్యక్రమాలను చేస్తారు.

అయితే ఈ 16 కార్యక్రమాలను కూడా మనిషి జీవితంలో నాలుగు దశలలో జరుగుతాయి.

మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు జననం, నామకరణం, అన్నప్రాసన, పెళ్లి, శ్రీమంతం ఈ విధంగా చనిపోయేవరకు 16 కార్యక్రమాలను చేస్తారు.అయితే ఈ 16 కార్యక్రమాలన్నింటినీ కూడా మనిషి జీవితంలో నాలుగు దశలలో మాత్రమే నిర్వహిస్తారు.

మనిషి జీవితంలో ఉన్న ఆ నాలుగు దశలు ఏమిటంటే బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేవి నాలుగు దశలు ఉంటాయి.అయితే వీటిని గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం.

బ్రహ్మచర్యం:మనిషి జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు విద్యాబుద్ధులను నేర్చుకోవడం కోసం గురుకులాలలో నివసిస్తుంటారు.ఈ గురుకులాలలో చేరిన తర్వాత ఎలాంటి ఇతర ఆలోచనలు మనసులోనికి రాకుండా విద్యాభ్యాసం చేయడం, నియమ నిబంధనలతో ఉంటూ వాటిని పాటించడం వంటివి బ్రహ్మచర్యంలో జరుగుతాయి.

Advertisement

గార్హస్థ్యము: బ్రహ్మచర్యంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తనకు నచ్చిన కన్యను వివాహం చేసుకొని కుటుంబ బాధ్యతలను చేపట్టాలి.ఇంటికి వచ్చే అతిథులను ఆదరించి వారికి గౌరవపూర్వకంగా మర్యాదలు చేయాలి.

పితృతర్పణాలు, నిత్య కర్మలు చేస్తూ వారిని సంతృప్తి పరచాలి.అదేవిధంగా వారికి పుట్టిన సంతానం కోసం విద్యాబుద్ధులను ఈ దశలో నేర్చుకోవాలి.

వానప్రస్థము: వానప్రస్థము దశలో మనిషి ఇంటి బాధ్యతలన్నీ తమ సంతానానికి నేర్పించుకోవాలి.కుటుంబ సమస్యల గురించి ఏమాత్రం చింతించకుండా కేవలం దేవుడిని ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉండటమే ఈ దశలో చేయాల్సిన పని.సన్యాసం: మానవుని జీవితంలో అతి చివరి దశగా సన్యాస జీవితం గడుపుతుంటారు.సన్యాసం పుచ్చుకునే వారు ఎలాంటి భోగాలను ఆశించకుండా కేవలం భగవంతునిలో చేరటానికి సాధన చేయడమే సన్యాసి కర్తవ్యం.

అయితే సన్యాసం పుచ్చుకొని అహంకారం కలిగినవారు బ్రహ్మ పదాన్ని చేరుకోలేదని చెప్పవచ్చు.ఈ విధంగా మనిషి పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు నాలుగు దశలలో జీవిస్తూ ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్5, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు