టీఎస్ అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న డీకే అరుణ..!!

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇవాళ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు.

ఈ మేరకు ఉదయం 11 గంటలకు కలవనున్న డీకే అరుణ హైకోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేయనున్నారు.

కాగా గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణ మోహన్ రెడ్డిపై ధర్మాసనం అనర్హత వేటు వేసింది.

అదే సమయంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది.అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం బేషజాలకు పోకుండా తీర్పును గౌరవించాలని డీకే అరుణ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కోర్డు ఆర్డర్ కాపీ రాగానే ఎలక్షన్ కమీషనర్, అసెంబ్లీ కార్యదర్శి మరియు స్పీకర్ ను కలవనున్నట్లు డీకే అరుణ చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు