DJ పాప 'వావ్' అనిపించేస్తుంది..!

డీజే టిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నేహా శెట్టి ఆ ఒక్క సినిమాతో అమ్మడు సూపర్ పాపులర్ అయ్యింది.

అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా సరే రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో వచ్చింది.

డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నేహా శెట్టి ఆడియెన్స్ ని మెప్పించింది.ఆ సినిమా హిట్ అవడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈమధ్యనే అల్లు అర్జున్ తో జొమాటో యాడ్ లో కూడా నేహా శెట్టి నటించిన విషయం తెలిసిందే.ఇక లేటెస్ట్ గా అమ్మడు వావ్ మేగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటో షూట్ ఇచ్చింది.

హాట్ సమ్మర్ లో కూల్ లుక్స్ తో నేహా శెట్టి నిజంగానే వావ్ అనిపిస్తుంది.డీజే టిల్లు ద్వారా వచ్చిన క్రేజ్ ని అమ్మడు ఇలా వాడేసుకుంటుంది.

Advertisement

వావ్ మేగజైన్ కవర్ పేజ్ తో నేహా శెట్టి ఆడియెన్స్ ఇంకాస్త దగ్గరయ్యే అవకాశం ఉంది.మరి అమ్మడు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డకి కూడా సూపర్ పాపులారిటీ వచ్చింది.సిద్ధు యాక్టింగ్ కి ఆడియెన్స్ అంతా ఫిదా అయ్యారు.

అందుకే ఆ సినిమాని సెన్సేషనల్ హిట్ చేశారు.ఈమధ్య ఓటీటీలో కూడా అది అదుర్స్ అనిపించింది.

సోనియా వస్తారో లేదో ? నేడు ఢిల్లీకి రేవంత్ 
Advertisement

తాజా వార్తలు