ఐకాన్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు బ్యూటీ.. ఏ సినిమాలో అంటే?

ఈ మధ్యనే రిలీజ్ అయినా డీజే టిల్లు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పని లేదు.

చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ కొట్టారు.

ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈమెకు హిట్ రావడంతో ఫుల్ జోష్ లో ఉంది.

ప్రెసెంట్ నేహా శెట్టి కు వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.అందులో భాగంగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించే అవకాశం ఈ అమ్మడికి వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే సినిమాలో కాదట.ఒక యాడ్ లో నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement
Neha Shetty Shares Screen Space With Allu Arjun, Neha Shetty, Allu Arjun, Zomato

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్.టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ రష్మిక మందన  హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా హిందీలో కూడా సత్తా చాటి అక్కడ కూడా 100 కోట్ల మార్క్ టచ్ చేసి అల్లు అర్జున్ స్టామినా పాన్ ఇండియా స్థాయిలో పెరిగేలా చేసింది.

Neha Shetty Shares Screen Space With Allu Arjun, Neha Shetty, Allu Arjun, Zomato

ఈ సినిమా ఇంత భారీ సక్సెస్ అందుకోవడంతో బన్నీకి వరుసగా యాడ్స్ లో నటించే అవకాశం లభించింది.అందులో జొమాటో ఒకటి.ఈ ఫుడ్ యాడ్ లో అల్లు అర్జున్ తో చేసే యాడ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి.

దీంతో కొత్త బ్రాండ్ అంబాసిడర్ బాగానే ఆకట్టుకుంటున్నాడు.తాజాగా మరొక యాడ్ రూపొందించినట్టు తెలుస్తుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

దానికి సంబదించిన ప్రోమో రిలీజ్ చేసారు.ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది.

Advertisement

ఈ యాడ్ లో ఈ అమ్మడు కూడా నటించింది.కాగా అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప 2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

https://youtu.be/NAzdQYzwnpc

తాజా వార్తలు