వసతి గృహాల్లో ఎన్రోల్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ చేయాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు పెంచడం పై ప్రత్యేక ఫోకస్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag jayanthi ) ప్రత్యేక అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు పున ప్రారంభమై పక్షం రోజులు అయిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా సిరిసిల్ల పట్టణంలోని బిసి ప్రి మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని, గిరిజన బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వసతి గృహాల్లో శానిటేషన్, త్రాగునీటి సరఫరా, కిచెన్ రూం , టాయిలెట్ ల పరిశుభ్రతను పరిశీలించారు.వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య, నమోదు ను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

బిసి ప్రి మెట్రిక్ బాలికల వసతి గృహం( BC Welfare Hostel )లో 43 మంది విద్యార్థినులు ఉన్నారనీ సంబంధిత వసతి గృహా సంక్షేమ అధికారిణి హైందవి జిల్లా కలెక్టర్ కు తెలిపారు.గిరిజన పోస్ట్ మెట్రిక్ వసతి గృహం( Tribal Welfare Hostels )లో 55 మంది విద్యార్థి నిలు ఉన్నారనీ జిల్లా కలెక్టర్ కు హెచ్ డబ్ల్యు ఓ శ్యామల తెలిపారు.

ఈ వసతి గృహంలో ఆర్ ఓ ప్లాంట్ రెండు రోజుల్లో ఇన్స్టాలేషన్ పూర్తి చేయాలన్నారు.వర్షాకాలంలో విద్యార్థులకు దోమల బెడద లేకుండా కిటికీలకు జాలిలు ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

గిరిజన పోస్ట్ మెట్రిక్ వసతి గృహం భవన నిర్మాణానికి పెద్దూరులో ల్యాండ్ కేటాయించినందున వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు మార్గ నిర్దేశనం చేశారు.

వసతి గృహాల్లో బేసిక్ ఫెసిలిటీ లు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.అర్జెంట్ ఫెసిలిటీ అవసరమైతే తన దృష్టికి తేవాలన్నారు.

వెంటనే వాటిని సాంక్షన్ చేస్తామని చెప్పారు.విద్యార్థినిలకు మెను ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని చెప్పారు.

తనిఖీలు కలెక్టర్ వెంట జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాఘవేందర్, వసతి గృహాల ప్రత్యేక అధికారులు ఉపేందర్ రావు, రఫీ తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News