3 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో 3 లక్షలు రూపాయల సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేసినట్లు మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం కాపాడడానికి పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు.

ప్రజలకు అలాగే ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చు పెట్టుకున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులను అందించడం జరుగుతుందన్నారు.పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం అత్యవసరంగా ఎల్ఓసి లను కూడా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, డైరెక్టర్లు గంట చిన్న లక్ష్మి బుచ్చ గౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా కార్యదర్శి వంగగిరి రెడ్డి, మండల అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ కార్యదర్శి అంతర్పుల గోపాల్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, మేగి నరసయ్య, రేస్ శంకర్,మైనార్టీ పట్టణ అధ్యక్షులు నవాబ్, గంట అంజయ్య, స్వామి, ధ్యాగం నారాయణ, గంట వెంకటేష్, గన్న మల్ రెడ్డి, గన్న శోభ, గోల్పెల్లి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Advertisement

Latest Rajanna Sircilla News