ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం చెప్పిన దర్శకుడు?

తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు ఉదయ్ కిరణ్.

తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నారు ఆయన.

తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చారు.ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో, ఆ పై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి.

సాఫీగా సాగుతున్న ఆయన జీవితంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో తన కెరీర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని తట్టుకోలేక 2014లో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.

ఇక ఆయన మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సూసైడ్ అనేది ఒక చదువుకున్నవాడు గాని, సొసైటీని బాగా ప్రేమించిన వాడుగానీ ఎంతో మంది అభిమానుల ప్రేమని పొందినవాడు గాని ఎంతో కొంత రైటర్స్, డైరెక్టర్స్, నిర్మాతల వల్ల తక్కువ టైం లో చాలా జీవితాని చూసినవాడు గాని తీసుకోకూడని నిర్ణయం అని ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య తెలిపారు.

Advertisement

ఇకపోతే అప్పుకట్టలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే అయ్యోపాపం అనిపిస్తుంది.కానీ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నాడంటే అయ్యోపాపం అనిపించకూడదని ఆదిత్య అన్నారు.అంటే అతని ఉహించినదానికంటే రియాలిటీ కి దగ్గరగా లేకపోవడం వల్ల అలా జరిగిందని ఆయన అన్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు