Rajamouli : మూడు పార్ట్ లుగా మహాభారతం.. దర్శకుడు రాజమౌళి కాదట.. ఎవరంటే?

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకులలో ఒకరిగా రాణించడంతో పాటు అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు జక్కన్న.

గత ఏడాది ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజమౌళి.ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు తన రేంజ్ ను కూడా పెంచుకున్నారు.

ఇకపోతే మహాభారతం సినిమా తీయాలి అన్నది తన కల అని ఇప్పటికీ రాజమౌళి అనేక సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ మాటను చాలా ఎలా క్రితమే చెప్పారు.

Director Vivek Agnihotri Announces Mahabharat Movie Three Parts

అయితే ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులలో పీరియాడికల్ సినిమాలు చేయాలి అంటే అది కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమవుతుంది అంతలా బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు జక్కన్న.దీంతో ఎప్పటికైనా రాజమౌళి మహాభారతం( Mahabharatam ) సినిమాలో తెరకెక్కిస్తారు అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే జక్కన్న కు షాక్ ఇస్తూ ఓ డైరెక్టర్ మహాభారతం సినిమాని ప్రకటించాడు.

Advertisement
Director Vivek Agnihotri Announces Mahabharat Movie Three Parts-Rajamouli : మ

ఇప్పుడదే మూవీ లవర్స్‪‌ని కంగారు పెడుతోంది.హిందీలో ఏవేవో సినిమాలు తీసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి( Director Vivek Agnihotri ).కనీసం గుర్తింపు సంపాదించలేకపోయాడు.ది తాష్కెంట్ ఫైల్స్ సినిమాతో కాస్త ఫేమ్ వచ్చింది.

Director Vivek Agnihotri Announces Mahabharat Movie Three Parts

ఇక ది కశ్మీర్ ఫైల్స్ ( The Kashmir Files )సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఈ ఫేమ్‌ని క్యాష్ చేసుకోవాలని ద వ్యాక్సిన్ వార్ సినిమాని తీశారు.సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కనీసం వసూళ్లు తెచ్చుకోలేక ఘోరమైన డిజాస్టర్ అయింది.

ఇప్పుడు మహాభారతం సినిమాని మూడు భాగాలుగా తీస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు.పర్వ( parva ) అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు కృష్ణుడు, అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

మరి ద కశ్మీర్ ఫైల్స్ తప్ప చెప్పుకోదగ్గ రేంజులో ఒక్కటంటే ఒక్క సినిమా తీయలేకపోయిన వివేక్ అగ్నిహోత్రి.మహాభారతం చిత్రాన్ని ఏం చేస్తాడోనని ఆడియెన్స్ కంగారుపడుతున్నారు.మరి ఈ విషయంపై కొందరు రాజమౌళిని ట్యాగ్ చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

కాగా రాజమౌళి ఈ విషయంపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు