R Balki : శ్రీదేవి మూవీపై ఆసక్తికర వాఖ్యలు చేసిన నిర్మాత.. పెట్టిన డబ్బులు తిరిగిరావు అన్నారంటూ?

దివంగతన నటి అతిలోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శ్రీదేవి( sridevi ) భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతోనే ఉన్నాయి.

 Sridevi English Vinglish Struggled To Get Producers Says R Balki-TeluguStop.com

ఆమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలు నటించి మెప్పించింది.తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

కానీ ఊహించని విధంగా చిన్న వయసులోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది.ఇది ఇలా ఉంటే శ్రీదేవి నటించిన సినిమాలలో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాకి ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పవచ్చు.

Telugu Balki, Bollywood, Gauri Shinde, Sridevi, Tollywood-Movie

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చారు.ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చిత్ర నిర్మాత ఆర్‌ బాల్కి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ఆలోచించినా కూడా ఖర్చు ఎక్కువ కావడంతో ఇతర నిర్మాతలను సంప్రదించినట్టు తెలిపారు.అయితే నిర్మాతలు ముందుకురాలేదని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Telugu Balki, Bollywood, Gauri Shinde, Sridevi, Tollywood-Movie

దర్శకురాలు గౌరీశిండే( Gauri Shinde ) ఈ కథను సిద్ధం చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించలేదు.హీరోయిన్‌ ఓరియెంటెడ్ మూవీ యూఎస్‌లో షూట్‌ అనగానే.హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టాలని ఎవరు అనుకుంటారు? అని పలువురు మాటలు అన్నారు.అంతేకాకుండా పెట్టిన డబ్బు తిరిగి రాదని కూడా అన్నారు.అలాంటి సమయంలో రాకేశ్‌ ఝున్‌వాలాని కలిశాను.నిర్మాణం విషయంలో ఆయన సాయం చేయడంతో మా సినిమా పట్టాలెక్కింది.అయితే ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ కంటే ముందు శ్రీదేవితో నేను వేరే సినిమా చేయాలనుకున్నాను.

కాకపోతే అది పట్టాలెక్కలేదు.అలాంటి సమయంలో గౌరీ శిండే రాసిన కథ విని ఆమెకు సరిగ్గా సరిపోతుందని భావించను.

దర్శకురాలు చెప్పిన కథ విని శ్రీదేవి కూడా వెంటనే ఓకే అన్నారు అని ఆర్‌.బాల్కి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube