మా’ ఎలక్షన్స్.. ఢీ అంటే ఢీ అంటున్న ప్యానెల్స్.. అలాంటి పార్టీలు కూడా ఉన్నాయా ? 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ సారి జనరల్ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మాటల యుద్ధం జరుగుతున్నదని చెప్తున్నారు.

గతంలో మా ఎలక్షన్స్ అస్సలు తెలిసేది కాదని కాని ఈ సారి అలా లేదని అంటున్నారు.ఇకపోతే మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ (మా) అభివృద్ధి, సంక్షేమం తన ధ్యేయం అని ఒక ప్యానెల్ ప్రచారం చేసుకుంటుంటే.మరొక ప్యానెల్ మా బిల్డింగ్ తమతోనే అని మరో ప్యానెల్ ప్రచారం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్యు ప్యానెల్ సభ్యులు దూషణలకు కూడా దిగారు.ఒకరిపైన మరొకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు.

Advertisement
Dinner Parties In Maa Elections , Maa Elections, Manchu Vishnu, Prakash Raj, Tol

ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే అంశాన్ని ప్రస్తావించారు.మొత్తంగా మేనిఫెస్టోలు, విమర్శలు, ప్రతి విమర్శల పర్వంతో అసెంబ్లీ ఎన్నికలకు మించి అన్న రీతిలో మా ఎన్నికల ప్రచారం జరుగుతోంది.

ఇద్దరూ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Dinner Parties In Maa Elections , Maa Elections, Manchu Vishnu, Prakash Raj, Tol

ఇకపోతే సాధారణ ఎన్నికల మాదిరిగా ఈ సారి మా ఎన్నికల కోసం రాత్రి పూట డిన్నర్ పార్టీలు ఇచ్చి మా సభ్యులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు.మార్నింగ్ టైంలోనో బ్రేక్ ఫాస్ట్ బ్రేక్ అంటూ.లేదా లంచ్ మీట్ అంటూ.

లేదా డిన్నర్ పార్టీ అంటూ మా ప్యానెల్ వారు.మా సభ్యులకు తమ మేనిఫెస్టో వివరించే ప్రయత్నం చేస్తున్నారట.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

అయితే, మరి కొన్ని గంటల్లోనే మా ఎలక్షన్స్ జరిగి ఏ ప్యానెల్ విన్ అవుతుందో తేలనుంది.ఈ క్రమంలోనే ఎన్నికలు ఎలా జరగనున్నాయి? ఎంత మంది మా సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు? ఎవరు అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు? అనే విషయాలు తెలుసుకునేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు జనాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు