Pawan Kalyan: ఇండస్ట్రీలోకి రాకముందు పవన్ ఆ అమ్మాయిని అంతలా ప్రేమించారా.. ఎవరికి తెలియని సీక్రెట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఒకరు.

నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనంతరం ఈయన ఎంతో అద్భుతమైన విజయాలను అందుకొని హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇండస్ట్రీలో హీరోగా పొందినటువంటి పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టారు.జనసేన పార్టీ(Janasena Party)ని స్థాపించి రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇలా సినిమాలపరంగా రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈయన వృత్తి పరమైన జీవితాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత జీవితానికి వస్తే.పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

అయితే మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినటువంటి ఈయన ప్రస్తుతం మూడవ భార్య అన్నా లేజినోవాతో కలిసి ఉంటున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో రాజకీయాలలో(Politics )మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ ను భారీగా టార్గెట్ చేస్తూ ఉంటారు.అయితే తనని టార్గెట్ చేసిన వారికి పవన్ సైతం తన స్టైల్ లో సమాధానం చెబుతున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని కాకుండా ఇండస్ట్రీలోకి రాకముందు మరొక అమ్మాయిని ప్రేమించారనే విషయం చాలా మందికి తెలియదు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక అమ్మాయిని ప్రేమించాను అంటూ తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తానే స్వయంగా బయట పెట్టారు.పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చెన్నైలో ( Chennai ) ఉన్నప్పుడు తను ఒక కంప్యూటర్ క్లాస్ కి వెళ్లేవారట అయితే అక్కడ ఒక అమ్మాయి చాలా అందంగా ఉండడంతో అందరూ ఆ అమ్మాయిని ప్రేమలో పడేయాలని చూడగా ఆ అమ్మాయి మాత్రం ఎవరితోనో మాట్లాడేది కాదని, కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే మాట్లాడటానికి ఆసక్తి చూపించేదని వెల్లడించారు.

ఇలా అమ్మాయి పవన్ కళ్యాణ్ తో మాట్లాడటానికి మాత్రమే ఆసక్తి చూపించడంతో తన స్నేహితులందరూ కూడా తను నిన్ను ఇష్టపడుతుంది.ఒకసారి ప్రపోజ్ చెయ్యి అని చెప్పగా పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం తన పాత కారును చాలా శుభ్రంగా క్లీన్ చేసే అమ్మాయిని అందులో ఎక్కించుకొని సిటీ మొత్తం తిరిగి తనకు ఒకచోట ప్రపోజ్ చేశారట.ఇలా పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేయడంతో ఆ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతున్నావ్ నీ వయసు ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి అంటూ చెడమాడా తిట్టిందని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతుంది.

గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...
Advertisement

తాజా వార్తలు