కేజ్రివాల్ వెనక్కి తగ్గారా.. అసలు ప్లానెంటి ?

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి పార్టీల తరువాతి స్థానంలో అప్ నిలవాలని ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారాలని ఆమ్ ఆద్మీ అగ్రనేత అరవింద్ కేజ్రివాల్( Arvind Kejriwal ) భావిస్తూ వచ్చారు.అందుకు తగ్గట్టుగానే పార్టీని చాలా కింద నీరులా విస్తరిస్తూ వచ్చారు.

 Did Kejriwal Back Downthe Real Plan , Arvind Kejriwal , Priyanka Gandhi , Rahul-TeluguStop.com

ప్రస్తుతం జాతీయ పార్టీ హోదా లభించడంలో ఇక దేశ రాజకీయాల్లో ప్రధాని అభ్యర్థి స్థానానికి రాహుల్ గాంధీ, మోడి తరువాత అరవింద్ కేజ్రివాల్ పేరు గట్టిగా వినిపిస్తూ వచ్చింది.ఆయితే ఎవరు ఊహించని విధంగా విపక్ష కూటమికి ఆప్ మద్దతు తెలపడంతో ప్రధాని రేస్ లో కేజ్రివాల్ ఉన్నారా లేదా అనే డౌట్ చాలా మందిలో వ్యక్తమైంది.

అయితే ఆప్ నేత ప్రియాంక ఇటీవల మాట్లాడుతూ అరవింద్ కేజ్రివాల్ విపక్ష కూటమి ఇండియా తరుపున ప్రధాని రేస్ లో ఉన్నారని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Congress, Nitish Kumar, Priyanka Gandhi, Rahul Gandhi-Latest News - Telug

దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.ఎందుకంటే కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ.ఎవరి ప్రమేయం లేకుండా ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడం ఎంటనే చర్చ జోరుగా సాగింది.

ఆయితే ఆ తరువాత వివాదం పెద్దదౌతుండడంతో కేజ్రివాల్ ప్రధాని రేస్ లో లేరని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.దేశ ప్రయోజనక కోసమే కూటమిలో చేరాల్సి వచ్చిందని, ప్రధాని పదవి ఆశించి కాదని ఆ తరువాత ఆప్ అగ్రనాయకత్వం చెప్పుకొచ్చింది.

అయితే పార్టీ కూటమిలో లేనప్పుడు ప్రధాని పదవిపై గట్టిగానే మక్కువ చూపిన అరవింద్ కేజ్రివాల్.పొత్తులో భాగమైన తరువాత ఆ పదవి విషయంలో వెన్నక్కి తగ్గడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Telugu Congress, Nitish Kumar, Priyanka Gandhi, Rahul Gandhi-Latest News - Telug

ఆయితే విపక్ష కూటమి తరుపున ప్రస్తుతం ప్రధాని రేస్ లో రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో పాటు.జేడీయూ అధినేత నితిశ్ కుమార్ కూడా ఉన్నారు.అందుకే ప్రధాని రేస్ నుంచి కేజ్రివాల్ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆయితే కేజ్రివాల్ ప్రధాని రేస్ నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని టాక్.ప్రస్తుతం నార్త్ లో మాత్రమే అక్కడక్కడ సత్తా చాటుతున్న ఆప్.సౌత్ లో కూడా బలపడాలంటే కాంగ్రెస్ అండ తప్పనిసారి అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎదురునిలిచి ప్రధాని అభ్యర్థిగా ఉండేకన్నా కాంగ్రెస్ అండతో ముందుకు మంచిదనే ఉద్దేశ్యంతో కేజ్రివాల్ ప్రధాని రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.మరి ముందు రోజుల్లో ఆప్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube