Kavitha TRS : టీఆర్ఎస్ నేతలపై ఈడీ టార్గెట్.. నెక్స్ట్ కవితేనా?

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లోనూ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

ఇది మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్‌గానే సోదాలు జరిగినట్లు కనిపిస్తోంది.కొందరు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు.సోమాజిగూడలోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలో కూడా సోదాలు జరిగాయి.

కరీంనగర్‌లోని గంగుల కమలాకర్‌ ఇంట్లో, మంకమ్మతోటలోని శ్వేతా గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్‌తోపాటు మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement
Desire Lists Of Yellow Media Journalists , Enforcement Directorate, Hyderabad, I

గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే ఎనిమిది ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.

బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పేరొందిన నేపథ్యంలో తాము దీన్ని ఊహించామని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది.

Desire Lists Of Yellow Media Journalists , Enforcement Directorate, Hyderabad, I

అయితే ఈ వ్వవహారాలను చూస్తే టీఆర్ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.ఎమ్మెల్యే కొనగోలు వ్యవహారం బట్టబయలు అవ్వడం , మునుగోడు ఎన్నికల విజయంతో టీఆర్ఎస్ మంచి ఊపు మీద కనినిస్తుంది.అయితే టీఆర్ఎస్.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

బీజేపీ టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుండడంతో ఎలాగైన టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయాలనుకున్న బీజేపీ ఈడీ దాడులతో అటాక్‌ను ప్రారంభించింది.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని స్పష్టం అవుతుంది.

Advertisement

ముఖ్యంగా నెక్ట్స్ టార్గెట్ కవితే అని తెలుస్తుంది.కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇన్ని రోజులు ఈ స్కామ్‌ దర్యాప్తులో కాస్త వేగం తగ్గించిన ఈడీ ఇప్పుడు మళ్ళీ వేగం పెంచింది.

తాజా వార్తలు