ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన గడ్డం నవీన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.గడ్డం నవీన్ జబర్దస్త్ షో ద్వారా అంచనాలకు మించి పాపులర్ అయ్యారు.
జబర్దస్త్ షోకు ప్రస్తుతం గడ్డం నవీన్ దూరంగా ఉన్నా ఆయన ఈ షోలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతుండటం గమనార్హం.
గడ్డం నవీన్ అశోక్ సినిమాలోని స్టార్టింగ్ సీన్ లో నటించారు.
అప్పటికీ ఇప్పటికీ గడ్డం నవీన్ లుక్ పూర్తిస్థాయిలో మారిపోవడంతో చాలామంది ఆయనను గుర్తు పట్టలేకపోతున్నారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలలో గడ్డం నవీన్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన అశోక్, కిక్2, సైరా నరసింహారెడ్డి, ధృవ సినిమాలలో నటించానని గడ్డం నవీన్ పేర్కొన్నారు.
సైరా సినిమా సమయంలో చిరంజీవి నన్ను ప్రశంసించారని గడ్డం నవీన్ అన్నారు.ఆచార్య సినిమాలో మంచి సీన్ లో చేశానని కానీ ఎడిటింగ్ లో పోయిందని నవీన్ అన్నారు.14 సంవత్సరాల గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను నేను కలిశానని గడ్డం నవీన్ పేర్కొన్నారు.రామయ్య వస్తావయ్యా సినిమాలో నటించినా మంచి పాత్ర కాదని గడ్డం నవీన్ అన్నారు.

రామయ్యా వస్తావయ్యా షూట్ సమయంలో తారక్ గుర్తు పట్టి మాట్లాడారని నవీన్ తెలిపారు.ఢీ షోకు తారక్ జడ్జిగా హాజరైన సమయంలో తారక్ నా చెయ్యి పట్టుకుని వెళ్లారని గడ్డం నవీన్ పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు అంత మెమొరీ అని గడ్డం నవీన్ అన్నారు.
గడ్డం నవీన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా సినిమాలలో ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి.ఆయన రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని బోగట్టా.