నేనే దేవుణ్ణి .ఈ సినిమా పైన ఎన్ని వ్యాసాలు రాసిన తక్కువే.
ప్రతి విషయం ఒక ఆర్టికల్ కి కంటెంట్ అయ్యేంత సినిమా ఉంది.ఈ సినిమా కు దర్శకుడు బాల.
అయన ఏ విషయంలోను కంప్రమైజ్ అవ్వరు అని ఇండస్ట్రీ మొత్తం తెలుగు.ఈ సినిమాలో హీరోలు ఎందరో అనుకోని చివరికి ఆర్య దగ్గర ఫిక్స్ అయ్యారు.చివరికి షూట్ చేసాక కొన్ని రోజులకు నిర్మాతలు మళ్లి మళ్లి మారిపోతూనే ఉన్నారు.2004 లో మొదలైన సినిమా షూటింగ్ 2009 లో పూర్తి అయ్యి సినిమా విడుదలకు నోచుకుంది.షూటింగ్ మొదలు పెడుతుంటే హీరో మారుతాడు లేదంటే నిర్మాత మారుతాడు.చివరికి హీరోయిన్స్ విషయంలో కూడా అలాగే జరిగింది.
ఈ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ ని అనుకున్నారు.నిజానికి ఈ సినిమా మొత్తం హీరోనే ఉంటాడు.
హీరో సెంట్రిక్ గా సాగే చిత్రం ఇది.హీరోయిన్ ఉన్న కూడా తక్కువ సీన్స్ ఉంటాయి.అది కూడా అంధురాలిగా నటించాలి.అడుక్కుంటూ ఉండే అంధురాలి పాత్ర కోసం బాల చాల మంది చేత ఆడిషన్స్ చేయించి రిజెక్ట్ చేసాడు.ఆయనకు ఏ హీరోయిన్ ఒక పట్టాన నచ్చదు.మొదట తమిళ హీరోయిన్ గోపిక చెల్లెలు గ్లినిని ఈ పాత్ర కోసం అనుకున్నారు.
కానీ టైం గడిచిపోయింది ఆమెతో వర్క్ అవుట్ అవ్వలేదు.ఆ తర్వాత మలయాళ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ చేత కూడా నటింపచేయాలనుకున్నారు.
కానీ ఎందులో ఆ అప్షన్ కూడా సెట్ అవ్వలేదు .ఇక వివాదాల ముద్దుగుమ్మ భావన ను సైతం హీరోయిన్ అనుకున్నాక హీరో ఆర్యతో కలిపి ఆమె పోస్టర్స్ కూడా ప్రింట్ చేయించి ప్రచారం చేసారు.సినిమా షూటింగ్ మొదలైన తర్వాత నిర్మాతలు హ్యాండ్ ఇచ్చారు.మళ్లి షూటింగ్ వాయిదా పడింది .ఆమె ఇచ్చిన డేట్స్ కూడా అయిపోవడం తో చివరికి ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది.ఆ తర్వాత తెలుగు హీరోయిన్ అంజలి చేత ఆ పాత్ర వేయించాలని అనుకున్న కుదరలేదు.
మలయాళ హీరోయిన్ పార్వతి గురించి కూడా దర్శకుడు అనుకున్న అది సెట్ అవ్వలేదు.చివరికి తమిళ నటి కార్తీక ను కూడా అనుకున్నారు.ఆమెతో బిచ్చగత్తె వేషం వేయించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేసాక బాలకి నచ్చలేదు.ఆఖరికి హిందీ భామ నీతూ చంద్రన్ కూడా ఆడిషన్ ఇచ్చిన ఆమె కూడా ఆ పాత్రకు సూట్ అవ్వలేదు అంటూ బాల రిజెక్ట్ చేసాడు.
మొత్తానికి ఎలాగోలా హీరోయిన్ పూజ తో ఆ వేషం వేయించి సినిమా షూటింగ్ పూర్తి చేసారు.