Deputy CM Bhatti Vikramarka : మహిళలకు గుడ్ న్యూస్ తెలియజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అడుగులు వేస్తోంది.

ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే నాలుగు అమలు చేస్తుండగా మరో రెండు పార్లమెంట్ ఎన్నికలకు ముందే అమలు చేయడానికి రెడీ అయ్యారు.

గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఎత్తున విజయం సాధించిన కాంగ్రెస్.పార్లమెంట్ ఎన్నికలలో( Parliament Elections ) కూడా అదేవిధంగా గెలవడానికి కృషి చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయస్థాయి నేతలు.

హాజరవుతున్నారు.

Advertisement

పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఈ స్కీమ్ నీ పట్టించుకోలేదు.స్వయం సహాయక బృందాలకు అందించే ఈ స్కీమ్ నీ అతి త్వరలోనే ప్రారంభిస్తాం.

లక్షల మంది మహిళలకు( Women ) ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది అని ఆయన వెల్లడించారు.అటు 43వేల మంది సింగరేణి కార్మికులకు రూ.కోటి విలువైన ఇన్సూరెన్స్ అందించే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతామన్నారు.ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాలు అమలు చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది.

కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.మార్చి నెలలో 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

చిక్కుల్లో ముఖేష్ అంబానీ ‘అంటిలియా’ భవంతి!
Advertisement

తాజా వార్తలు