అభిశంసన పై ఓటింగ్..ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...!!!

అమెరికా అధ్యక్షుడుకి పదవీ గండం తప్పేలా లేదు.డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన అంశం ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి ట్రంప్ కుర్చీని కూలదోయడానికి సిద్దంగా ఉంది.

దాంతో డెమోక్రాట్లు ఇప్పుడు అభిశంసన అంశంపై మాట్లాడుతూ కొన్ని సవరణలు చేయాలి సూచిస్తున్నారు.జ్యూడిషియరీ కమిటీ అభిశంసన ప్రక్రియ ప్రారభించిన తరుణంలో ఈ సంఘటన జరిగింది.

ముందుగా రెండు రోజుల పాటు డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన పై చర్చ జరగనుంది.ఆ తరువాత అభియోగాలపై ఓటింగ్ జరుగుతుంది.

ట్రంప్ అధికార దుర్వినియోగం అమెరికన్ కాంగ్రెస్ కార్యకలాపాలని అడ్డుకునేందుకు ప్రయత్నించడం లాంటి ఈ రెండు విషయాలపై డెమోక్రాట్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Advertisement

ఇదిలాఉంటే డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన పై సవరణలు చేయాలంటూ జ్యూడిషియరీ కమిటీ కి రిపబ్లికన్లు 9 పేజీలతో కూడిన సవరణలు పంపారు.అయితే డెమోక్రాట్లు అందుకు అంగీకరించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.అధికార దుర్వినియోగానికి పాల్పడిన ట్రంప్ అభిశంసన ఎదుర్కోవాలిసిందే అంటూ డెమోక్రాట్లు పట్టు పడుతున్నారు.

అతి త్వరలో జరగనున్న ఓటింగ్ ట్రంప్ ని గద్దె మ్మీద ఉంచుతుందో లేదో వేచి చూడాలి అంటున్నాయి స్థానిక పత్రికలు.

Advertisement

తాజా వార్తలు