ఘనంగా దీపోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక చవితి పర్వదినాలు పురష్కరించుకుని బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహం వద మహిళాభక్తులచే ఘనంగా దీపోత్సవం నిర్వహించారు.

ఓంకారం, శివలింగం ఆకారాలలో ప్రమిదలను వరుసక్రమంలో ఉంచి చమురుతో కూడిన వత్తులను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు.

ఇట్టి దీపోత్స కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర యూత్ సభ్యులు, యువకులు మహిళలలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News