క్యా క్యాచ్ హే మాక్స్... అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో బిగ్ బాష్ లీగ్ టోర్నమెంట్ ( Big Bash League Tournament )జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 19 మ్యాచులు పూర్తి కాబడ్డాయి.

ఈ తరుణంలోనే తాజాగా మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ బ్రిస్ బెన్ ( Melbourne Stars vs.Brice Benn )హీట్ మధ్య హోరాహోరీ ఫైట్ జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో అది కాస్త హాట్ గా మారింది.

విషయం ఏమిటంటే, మెల్ బోర్న్ స్టార్స్ ఆటగాడు అయినటువంటి గ్లెన్ మాక్స్‌వెల్ పట్టిన క్యాచ్ చూసి ఆడిటోరియమే కాదు తోటి క్రీడాకారులు కూడా ఖంగు తిన్నారు.

అవును, ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.గాల్లోకి ఓ పక్షి మాదిరి ఎగిరి మరీ కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు గ్లెన్ మాక్స్‌వెల్.దాంతో ఇపుడు అంతా ఆ క్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement

వివరాల్లోకి వెళితే.బ్రిస్ బెన్ హీట్ జట్టు ప్లేయర్ విల్ ప్రెస్‌విడ్జ్ ఆడిన భారీ షాట్ ను గాల్లోకి ఎగిరి మరీ అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్( Glenn Maxwell ).లేకుంటే అది బౌండరీ దాటేది మరి.సిక్స్ వెళ్లే బంతిని.బౌండరీ గేటు వద్ద ఎగిరి పక్షిలాగా అందుకొని దాన్ని బౌండరీ లోపలికి విసిరి.

ఆ తర్వాత గ్రౌండ్ లోకి జంప్ చేసి.అద్భుతంగా అందుకున్నాడు గ్లెన్ మాక్స్‌వెల్.

కట్ చేస్తే, బ్యాట్స్మెన్ పెవిలియన్ కు పోవాల్సి వచ్చింది.

దాంతో గ్లెన్ మాక్స్‌వెల్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్యాచ్ చూసిన ఫ్యాన్స్ అందరూ గ్లెన్ మాక్స్‌వెల్ ను హీరో అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.ఈ క్రమంలో చాలామంది అభిమానులు.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
వైరల్ వీడియో : రాజకీయ నేతపై చీపురుతో దాడి చేసిన మహిళలు

"అద్భుతమైన క్యాచ్… ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడూ చూడలేదు!" అని కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ కీలక మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ల తేడాతో మెల్బోర్న్ స్టార్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది.

Advertisement

బ్రిస్ బెన్ హీట్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి రికార్డ్ సృష్టించింది.ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బ్రిస్ బెన్ హీట్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 149 పరుగులు సాధించింది.అయితే ఆ లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి మెల్బోర్న్ స్టార్స్ విక్టరీ సాధించడం విశేషం.

తాజా వార్తలు