టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ( Heroine Sai Pallavi )గురించి మనందరికీ తెలిసిందే.సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఇటీవలే అమరన్( Amaran ) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి.అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా తర్వాత సాయి పల్లవి పై ఉన్న అభిమానం మరింత పెరిగిందని చెప్పాలి.ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా మరింత పెరిగింది.
సాయి పల్లవి తన కెరీర్ ప్రారంభం నుంచే సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం అందుకుంది.
డాక్టర్ విద్యను( Doctor education ) పూర్తి చేసిన సాయి పల్లవిలో మొదటి నుంచి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా అందరూ సెలబ్రేషన్స్ లో మునిగితేలుతుంటే సాయి పల్లవి మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది.ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా మందిరాన్ని ( Puttaparthi Sri Sathya Sai Baba Mandir )ఆమె సందర్శించారు.
ఆమె ఇప్పటికే చాలాసార్లు అక్కడికి వెళ్లారు.అయితే తాజాగా తన కుటుంబంతో కలిసి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయి కల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.మానవుడు తనలోని చెడు గుణాలను త్యజించి సత్యనిష్ఠతో జీవిస్తే దైవత్వాన్ని పొందవచ్చనే సందేశాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి నాటిక రూపంలో సాయి పల్లవి తెలియజేశారు.
చెడు త్యజించి అందరూ సన్మార్గంలో పయనించాలని ఆమె కోరారు.అక్కడ బాబా నామస్మరణ చేస్తూ తనలోని ఆధ్యాత్మికతను ఆమె చాటుకున్నారు.
పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసిన ఆమె నుదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.అక్కడి ఆలయంలో కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో సాయి పల్లవి మునిగిపోయారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారడంతో అభిమానులు సాయి పల్లవిని ప్రశంసిస్తున్నారు.కొంతమంది సెలబ్రిటీలు పార్టీలు, పబ్‌ల పేరు తో ఎంజాయ్ చేస్తుంటే ఆమె ఆధ్యాత్మికత వైపు వెళ్లడంతో అభినందిస్తున్నారు.
ఇకపోతే సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ఇటీవలే అమరన్ మూవీ తో సక్సెస్ను అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.అలాగే నాగచైతన్యతో కలిసి తండేలు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.అలాగే బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత క్యారెక్టర్ లో కూడా నటించనుంది.