స్టార్ డైరెక్టర్ రాజమౌళికి( Star director Rajamouli ) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జక్కన్న సినిమాలకు బిజినెస్ కూడా ఒకింత భారీ స్థాయిలో జరుగుతుంది.
అయితే రాజమౌళి సినిమా వల్ల ఒక థియేటర్ సీజ్ అయిందనే విషయం మాత్రం చాలామందికి తెలియదు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈగ సినిమా వల్ల ఒక థియేటర్ ను సీజ్ చేయడం జరిగింది.
సినిమా ఇండస్ట్రీకి పైరసీ వల్ల తీవ్రస్థాయిలో నష్టం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సమస్య ఇప్పటిది కాదు.గతంలో కూడా పైరసీ జరగడం వల్ల నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టపోవడం జరిగింది.అయితే సాధారణంగా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రింట్ కు వేర్వేరు డిజిటల్ కోడ్స్ ఉంటాయి.
ఈ కోడ్స్ ద్వారా సినిమా ఏ థియేటర్ నుంచి పైరసీ జరిగిందో కూడా కనిపెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.
అప్పట్లో చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలో( Varadaiyapalem in Chittoor district ) ఉన్న థియేటర్ నుంచి ఈగ సినిమా( Eega movie ) పైరసీ జరిగినట్లు గుర్తించారు.అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ ( Suresh Productions )ఫిర్యాదు మేరకు ఆ థియేటర్ ను సీజ్ చేయడం జరిగింది.అయితే థియేటర్ యజమాని మాత్రం పైరసీకి తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గౌరీ శంకర్ ( Gauri Shankar )అనే థియేటర్ ను పోలీసులు సీజ్ చేయడంతో ఈ థియేటర్ పేరు మారుమ్రోగింది.
ఈగ సినిమాను జక్కన్న మొదట పరిమిత బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు.అయితే ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ మొత్తం ఖర్చు కావడంతో రాజమౌళి నిర్ణయం మారింది.జక్కన్న తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సినిమా సినిమాకు రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.రాజమౌళి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.