రాజమౌళి సినిమాలలో ఆ సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయట.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Directed by SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జక్కన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Producer Giri Comments On Rajamouli And Rajinikanth Combination, Rajamouli, Prod-TeluguStop.com

ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచాయి.అంతేకాకుండా రికార్డుల మోతలు మోగించాయి.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండును కూడా సృష్టించాయి.ఇకపోతే జక్కన్న చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

Telugu Giri, Girirajamouli, Rajamouli, Rajinikanth, Tollyood-Movie

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయ్యి సరికొత్త రికార్డులు సృష్టించింది.ఇకపోతే జక్కన్న తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేంటంటే.ఒక దశలో రాజమౌళి, రజనీకాంత్ కాంబినేషన్ సెట్ అయింది.

ఈ విషయం చాలామందికి తెలియదు.కానీ ఈ కాంబినేషన్ మాత్రం ఎందుకు కార్యరూపం దాల్చలేదు.

రాజమౌళి రజనీకాంత్ ఎందుకు సినిమా చేయలేదు అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.ఈ విషయాలపై నిర్మాత గిరి( Produced Giri ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

Telugu Giri, Girirajamouli, Rajamouli, Rajinikanth, Tollyood-Movie

నితిన్ హీరోగా నటించిన సై ( SYE )చిత్రానికి బడ్జెట్ భారీగా ఖర్చు అయింది అని దానివల్ల నిర్మాత నష్టపోయారు అని వార్తలు వచ్చాయి.దీనిపై గిరి మాట్లాడుతూ నాకు సై చిత్రంతో ఎలాంటి లాభాలు రాలేదు.నష్టాలే వచ్చాయి.కానీ ఆ నష్టం మరీ ఎక్కువ ఏమీ కాదు.కొంత లాస్ వచ్చిన మాట నిజమే అని గిరి అన్నారు.ఆ విషయం రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా తెలుసు.

దీనితో వాళ్లిద్దరూ నాతో ఒక మాట చెప్పారు.మనం ఇంకొక సినిమా చేద్దాం సర్, కానీ తొందరపడకండి.

నిదానంగా చేద్దాం అని చెప్పారు.ఒక టైంలో రాజమౌళి రజనీకాంత్ తో సినిమా చేద్దాం అనుకున్నారు.

నేను ఏఎం రత్నం ద్వారా రజనీకాంత్ నుంచి రాజమౌళికి ఫోన్ చేయించాను.ఇద్దరూ ఒకే సినిమా చేద్దాం అని హ్యాపీగా అంగీకరించారు.

రాజమౌళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఆ తర్వాత చర్చలు జరిగాయి.

కానీ ఇద్దరి షెడ్యూల్స్ బాగా టైం అయిపోయాయి.ఈ ప్రాజెక్ట్ లోకి ఏఎం రత్నం కూడా వస్తారేమో అనుకున్నాను.

కానీ కొన్ని కారణాల వల్ల రాజమౌళి, రజనీకాంత్ కాంబినేషన్ ముందుకు వెళ్ళలేదు అని గిరి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube