ప్రజా ఆకాంక్షలు నెరవేర్చాలని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా దీక్షా దివాస్...!

సూర్యాపేట జిల్లా: ప్రత్యేక రాష్ట్రంలో త్యాగాలు ఒకరు చేస్తే,భోగాలు ఒకరు అనుభవిస్తున్నారని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి.

డి.ఎస్.యు.రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రజా ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం దగ్గర సీపీఐ(ఎం.

ఎల్) ప్రజాపంథా డివిజన్ కమిటీ అధ్వర్యంలో దీక్షా దివాస్ నిర్వహించారు.దీక్షా చేస్తున్న వారిని పోలీసులు మధ్యలోనే బలవంతంగా అరెస్టు చేసి పోలిస్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు,నియామకాల కోసం ఎన్నో పోరాటాలు చేసి,ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన జరగడం దురదృష్టకరం అన్నారు.

రాష్ట్రంలో కనీసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదని,ప్రతిపక్షాలు కనీసం ప్రగతి భవన్ మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా ఏకపక్షంగా పరిపాలన సాగుతుందని విమర్శించారు.ఆత్మగౌరవం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలకు అవే అందడం లేదని,అన్ని వర్గాల ఆశలు అడియాశలుగా మిగిలాయన్నారు.

నిరుద్యోగుల ఆశల నెరవేరకపోగా అరకొర చేపట్టిన నియామక ప్రక్రియతో రాష్ట్రం అప్రతిష్ట పాలయిందన్నారు.విద్యాలయాలు, యూనివర్సిటీలు నిధులు, నియామకాలు లేక విలవిలలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపి అడిగే అవకాశం లేకుండా పోయిందన్నారు.రైతుల రుణమాఫీ అమలు కావడం లేదని,పంట కొనుగోలు జరగడంలేదని, కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

తొమ్మిదేళ్లుగా ఉద్యోగులకు ప్రమోషన్లు పర్మినెంట్ లేవన్నారు.రాష్ట్రంలో అధికారికంగా అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితుల్లో దశాబ్ది సంబరాలు అధికారంలో ఉన్నవారికి తప్ప ప్రజలకు కాదన్నారు.స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక తెలంగాణలో నిజమైన సంబరాలు జరుగుతాయన్నారు.

అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు,పెన్షన్లు ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని, ఇంటి స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని,దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులందరికీ 10 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమస్యలన్నీ అమలైనప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని,ఇది కేవలం కొంతమందికి మాత్రమే దశాబ్ది ఉత్సవాలని ఎద్దేవా చేశారు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరూ ఐక్యంగా మరో పోరాటం చేయవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయని, అందుకు ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక,కోశాధికారి జయమ్మ,ఐఎఫ్టియు జిల్లా నాయకులు షేక్ వాజీద్, పి.డి.ఎస్.యు నాయకులు సింహాద్రి, శైలజ,రాజేశ్వరి,లింగమ్మ, బావుసింగ్,రమణ,శోబా, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News