ఈ అమెరికన్ పోలీస్ ట్రైనింగ్ వీడియో చూశారా.. చూస్తే షాకే..

1980ల నాటి ఓ వివాదాస్పద పోలీసు ట్రైనింగ్( Police Training ) తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను 2017లో తీసివేసే వరకు చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్( Chicago Police Department ) ఉపయోగించింది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.క్రిమినల్ సిచువేషన్‌లో యూజ్‌ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉపయోగించాలో చెప్పే విధంగా ఈ వీడియోని రూపొందించారు.

ఇందులో ఒక వ్యక్తి రైలు పట్టాలు దాటుతూ వేగంగా నడుస్తూ వస్తుంటాడు అప్పుడు ఒక పోలీస్ అధికారి ఎటూ కదలకుండా ఒకే చోట మోకాళ్లపై కూర్చోమని చెబుతాడు.కానీ ఆ వ్యక్తి మాత్రం అలానే నడుస్తూ వచ్చి ఒకేసారి తన జేబులో నుంచి ఒక పర్సు బయటకి ఇస్తాడు.

ఆ పర్సులో తాను మూగ, చెవిటి( Deaf And Dumb ) అని రాసి ఉంటుంది.అయితే అతడు సడన్‌గా తన జేబులో నుంచి తీసే పర్సు ఒక తుపాకీ అయ్యుంటుందని చాలామంది పొరపాటు పడుతుంటారు.

Advertisement

దీన్ని ఒక పోలీస్ ఆఫీసర్ పై టెస్ట్ చేయడం కూడా మనం వీడియోలో చూడవచ్చు.పోలీస్ ఆఫీసర్( Police Officer ) ఆ యువకుడు తన జేబులో నుంచి తీసేది తుపాకీ అని భావించి వెంటనే అతడిని కాల్చేస్తాడు.తర్వాత అతడు మూగ, చెవిటి అనే విషయం తెలుసుకొని పశ్చాత్తాపడతాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న మరొక ఉన్నత ఆఫీసర్ ఎందుకు కాల్చావని ప్రశ్నిస్తాడు.

1982లో, పీటర్ ఫాక్ హోస్ట్ చేసిన ఈ వీడియోను "షూట్, డోంట్ షూట్"గా పిలిచారు.వ్యూయర్స్‌ తుపాకీ( Gun ) కాల్చాలా వద్దా అనేది నిర్ణయించడానికి ఇది పైన చెప్పినటువంటి దృశ్యాలను అందించింది.ప్రారంభంలో సామాన్యుల కోసం ఈ వీడియోని ఉపయోగించారు.

తర్వాత ఇది చికాగో పోలీసు రిక్రూట్‌మెంట్ల శిక్షణలో భాగమైంది.ఏది ఏమైనప్పటికీ, న్యాయ శాఖ నివేదికలో అధికారాన్ని సరిగ్గా ఉపయోగించకుండా బోధించినందుకు విమర్శలను ఎదుర్కొంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
వెక్కి వెక్కి ఏడ్చిన ఫుట్ బాల్ దిగ్గజం.. వైరల్ వీడియో

చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ కొంతకాలం తర్వాత వీడియోను ఉపయోగించడం మానేసింది, దృశ్యాలను మరింత ఆధునిక నేపధ్యంలో పునఃసృష్టించాలని ప్లాన్ చేస్తోంది.హిస్టారిక వెడ్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి 8 లక్షల దాక వ్యూస్ వచ్చాయి.

Advertisement

దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు