ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో హస్తం పార్టీ అధిక అసెంబ్లీ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ( Congress party )విజయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో టపాకాయలు పేలుస్తూ, స్వీట్లు పంపిణీ చేసుకుని డీజే పాటలతో నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

కార్యకర్తల కృషి మరువలేనిదని.

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను( Welfare schemes ) అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News