కాంగ్రెస్ పార్టీ ది ప్రజా పాలన బిఆర్ఎస్ పార్టీది రాచరిక పాలన : సద్ది లక్ష్మారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ పార్టీ ది ప్రజా పాలన బిఆర్ఎస్ పార్టీది రాచరిక పాలన అని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గా మార్చిన తర్వాత బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోగో లో ఉన్న చార్మినార్ ను మారుస్తున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు దానిని నమ్మవద్దని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అమరవీరుల పునాదుల మీద ఏర్పడినందున అట్టి రాష్ట్ర లోగోను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేధావుల సమక్షంలో లోగో అమరుల త్యాగాలను గుర్తు చేసుకొనేవిధంగా తయారు చేస్తారని ఆయన గుర్తు చేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పాలకులం కాదు సేవకులం అనే విధంగా పనిచేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాకిస్థాన్, ఆంద్రా కు చెందిన వారితో లోగో చేస్తే తప్పు లేదు కానీ ఆంద్రాకు చెందిన తెలంగాణ మేధావులతో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

లోగో ను ఇంకా పూర్తి చేయనే లేదు మీరు భుజాలు తడుముకుంటూ ఆందోళనకు దిగి ఇబ్బంది పడుతున్నారని దీనిపై నిన్న హైదరాబాదులో మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.అప్పుడు రజాకార్ల కు చిహ్నం గా చార్మినార్ నిర్మించడం జరిగిందని దాన్ని తీసేసి తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన సాకలి ఐలమ్మ , దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుల త్యాగాలను గుర్తించుకునే విధంగా లోగో ఆవిష్కరణ చేయబోతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నువ్వు చెబితే బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెబితే అయ్యేది కాదు అది మేధావులతో చర్చించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు లోగో తయారు చేస్తారన్నారు.బిఆర్ ఎస్ పార్టీ వాళ్లు ధర్నా లు చేసినంత మాత్రాన చేసేది కాదన్నారు, ఏది చేయ్యాలే ఎది చెయ్యొద్దో మాకు తెలుసు అన్నారు.

Advertisement

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వంగ గిరిధర్ రెడ్డి, పందిల్ల లింగం గౌడ్ , కోమీరి శెట్టి తిరుపతి , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ మెండే శ్రీనివాస్ యాదవ్ , గుండాడి రాంరెడ్డి, రఫీక్ , గంట బుచ్చ గౌడు , గన్న శ్రీనివాస్ రెడ్డి , రామ్ చందర్ నాయక్ చెరుకు ఎల్లన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం బి వై నగర్ కు చెందిన కే .గిరి అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 3,00,000/- రూపాయలు మంజూరు చేపించారు.అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా మాజీ ప్రధాని పివినరసింహారావు జయంతి వేడుకలు
Advertisement

Latest Rajanna Sircilla News