తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి.
ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ ( BRS party )తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించగా ఇక వచ్చే నెల మొదటి వారంలో లేదా రెండో వారంలో కాంగ్రెస్ ( Congress party )తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ఇక ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది.
దాదాపు 1000 పైగానే దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంచితే ఈ మద్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి వ్యవహారం ఆ పార్టీలో కొత్త కన్ఫ్యూజన్ కు తెరతీస్తోంది.
ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న పొంగులేటి( Ponguleti Srinivas Reddy ).వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బిఆర్‌ఎస్ కు ఒక్క సీటు కూడా దక్కనివ్వనని శపథం చేశారు.ఇక ఇటు ఇటువైపు ఖమ్మం జిల్లా కు సంబంధించి తాను కోరిన టికెట్లు ఇవ్వాలని అధిష్టానం వద్ద ముందే ఒప్పందం కుదుర్చుకున్నాడనే వార్తలు ఆ మద్య గట్టిగా వినిపించాయి.అయితే ఆయన ఏకంగా మూడు నియోజిక వర్గాలకు దరఖాస్తు చేసుకోవడం కొత్త చర్చలకు దారి తీస్తోంది.
కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు ఈ మూడు నియోజిక వర్గాల బరిలో నిలిచేందుకు పొంగులేటి దరఖాస్తు చేసుకున్నారు.ఒకవేళ సీటు కన్ఫర్మ్ అయితే ఆయన మూడు నియోజిక వర్గాల నుంచి పోటీ చేస్తారా లేదా ఇంకేమైనా ప్లాన్ లో ఉన్నారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం.
కాగా కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీ చేసే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో కొత్తగూడెం బరిలో ఆయన నిలిచి మిగిలిన రెండు స్థానాల్లో తన అనుచరులను బరిలో దించే ప్లాన్ లో పొంగులేటి ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే పాలేరు సీటు కోసం ప్రయత్నించి బిఆర్‌ఎస్ లో కంగుతిన్నా తుమ్మల ( Tummala Nageswara Rao )కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.అందువల్ల ఒకవేళ తుమ్మల కాంగ్రెస్ లో చేరితే పాలేరు సీటు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
దీంతో పొగులేటి పాలేరులో తన అభ్యర్థిని నిలబెదతారా లేదా తుమ్మల కోసం ఆ సీటు కేటాయిస్తారా అనేది చూడాలి.మొత్తానికి ఏకంగా మూడు స్థానాల్లో బరిలో దిగేందుకు పొంగులేటి ప్రయత్నించడం హస్తం పార్టీలోనే కాదు.
టోటల్ రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశం అయింది.