ఇసుక దందాపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ఏరు నుండి గత కొన్ని నెలలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి, అధికార పార్టీ నేత ఇసుక మాఫియా అంటూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దర్జాగా దందా చేస్తున్న విషయమై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా సూర్యాపేట డిస్ట్రిక్ట్ కన్స్యూమర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ చోల్లేటి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతను చెడు మార్గంలో ప్రోత్సహిస్తూ,ప్రభుత్వ అదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Latest Suryapet News