టాలీవుడ్ హీరో సందీప్ కిషన్( Hero Sandeep Kishan ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సందీప్ కిషన్.
ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే వి.ఐ ఆనందదర్శకత్వంలో సందీప్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ).ఈగల్ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు.ఒకవేళ వాళ్లు మాకు ఫోన్ చేసి మాట్లాడితే స్పందించేవాళ్లం అని తెలిపారు సందీప్ కిషన్.ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 16న విడుదల కానుంది.అయితే వాలెంటైన్స్ డే స్పెషల్ అంటూ రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశారు.చాలా ఏరియాల్లో వేసిన ఈ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది.అయితే కొన్ని చోట్ల మాత్రం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.కొందరేమో సినిమా బాగుందని అంటే, ఇంకొందరు యావరేజ్ అని అంటున్నారు.మరి కొందరు పర్లేదు, డీసెంట్ మూవీ( Decent Movie ) అని అంటున్నారు.
ఇలా భైరవకోన సినిమా మీద రకరకాల చర్చలు మాత్రం నెట్టింట్లో నడుస్తున్నాయి.మూవీలో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనేలా ఉందట.
ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయిందని, సెకండాఫ్ బాగుందని తెలుస్తోంది.అలాగే ఇందులో విజువల్స్ టాప్ నాచ్‌లా ఉన్నాయని, పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయట.

ఇక ఆర్ఆర్ కూడా అదిరిపోయిందని అంటున్నారు.ఈ ఫాంటసీ థ్రిల్లర్( Fantasy Thriller ) అదిరిపోయిందని బొమ్మ బ్లాక్ బస్టర్ అని మరి కొందరు చెబుతున్నారు. వీఐ ఆనంద్ మరోసారి తన మ్యాజిక్ చూపించాడని చెబుతున్నారు.సందీప్ కిషన్‌కు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అవుతుందని, ఈ మూవీ హిట్ అంటూ నెటిజన్లు ట్వీట్లేస్తున్నారు.
సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ అని చెబుతున్నారు.వర్ష పాత్రకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదట.
కేవలం రొమాంటిక్ సీన్లకే వాడేశారట.వర్ష కంటే కావ్యా థాపర్( Kavya Thapar ) పాత్ర బాగుందట.
ఆమెకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదని అంటున్నారు.వైవా హర్ష, వెన్నెల కిషోర్( Vennela Kishore ) పాత్రలు బాగున్నాయట.
దర్శకుడు సెకండాఫ్‌ను అంత ఇంట్రెస్టింగ్‌గా మల్చలేదని, అద్భుతమైన ఇంటర్వెల్ తరువాత వచ్చే ద్వితీయార్దం నీరుగార్చేశాడని, ఒక పాయింట్‌కు స్టిక్ కాకుండా సబ్ ప్లాట్స్‌తో తికమక పెట్టాడన్నట్టుగా చెబుతున్నారు.సందీప్ కిషన్‌కు మాత్రం ఇది ది బెస్ట్ సినిమా అని, ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతంగా చేసిన చిత్రం మరొకటి లేదని అందరూ అంటున్నారు.
మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాతో సందీప్ కథలో సూపర్ హిట్ సినిమా పడ్డట్టే అన్ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
.






