పోరాట ఉద్యమరాలు ఐలమ్మ - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమరాలు చాకలి ఐలమ్మ ( Ailamma )అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ భూమికోసం,భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.నిజాం నిరంకుశల పాలనకు పోరాడిన గొప్ప వీర వనిత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, ఎంపీటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సిములు, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, రజక సంఘం ప్రతినిధులు కంచర్ల పరుశురాం, కొన్నే పోచయ్య,దీటి నరసయ్య, మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, మీసం రాజం, నంది కిషన్, సురభి కాంతారావు, పందిర్ల పరుశురాం గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Advertisement

Latest Rajanna Sircilla News