అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు 56, జిల్లా సంక్షేమ అధికారికి 8, విద్యాశాఖకు 7, ఎస్డీసీకి 6, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 5, వ్యవసాయ శాఖ, సెస్ కు 4 చొప్పున, ఉపాధి కల్పన శాఖకు 3, ఏరియా ఆసుపత్రి, నీటి పారుదల, ఎస్పీ ఆఫీస్, డీసీఎస్ఓ, ఎంపీడీవో కోనరావుపేట, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్ కు రెండు చొప్పున, డీఎంహెచ్ఓ, డీఎండబ్ల్యూఓ, చేనేత జౌళి శాఖ, సీఈఓ జడ్పీ, ఫిషరీస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్, మైన్స్, ఎంపీడీవో తంగల్లపల్లి, ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి.

మొత్తం 115 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమం లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టులు

Latest Rajanna Sircilla News