యూపీ మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్( Yogi Adityanath ) రాఖీ పండుగ సందర్భంగా యూపీ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.ఈనెల 30, 31 తేదీలలో రాష్ట్రంలో అన్ని సిటీ బస్సులలో ఉచితంగా మహిళలు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

 Cm Yogi's Sensational Announcement Of Free City Bus Travel For Women On Rakhi Fe-TeluguStop.com

రేపు రాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 31వ రాత్రి 12 గంటల వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అని స్పష్టం చేశారు.ఇదే సమయంలో ట్విట్టర్( Twitter ) వేదికగా మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి గుర్తుగా ప్రతి ఏడాది రక్షాబంధన్( Rakhi Pournam ) పండుగను ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు.తమ్ముళ్లు మరియు అన్నలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోదరీమణులు రాఖీలు కడతారు.

ఇందుకు ప్రతిగా వారి జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇస్తూ తమ సోదరీమణులకు కానుకలు ఇస్తారు.హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ శుక్లపక్షంలోని నిండు పున్నమి రోజు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు.

ఈ క్రమంలో ఈసారి ఆగస్టు 30, 31 తేదీలలో రెండు రోజులపాటు రాఖీ వేడుకలు జరగనున్నాయి.దేశవ్యాప్తంగా రాఖీ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు.రాఖీ పండుగ దగ్గర పడుతూ ఉండటంతో సోదరీమణులు తమ సోదరులకు మంచి రాఖీ కట్టాలని సొంతంగా కూడా తయారు చేస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube