ఎంపీ ఎన్నికల విషయంలో ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

దేశవ్యాప్తంగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కీలక పాత్ర పోషించారు.

CM Revanth Reddy Key Comments In The Joint District Review Meeting Regarding MP

దీంతో అనంతరం ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించారు.దీంతో త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దీనిలో భాగంగా  ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.తాజాగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కావడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో అధికారుల నియామకంలో ఆచితూచి వ్యవహరించాలి.పార్లమెంట్ ఎన్నికల కోడ్( Parliament Election Code ) వచ్చేలోపు కీలకమైన పనులను మొదలు పెట్టాలని సీఎం ఆదేశించడం జరిగింది.

త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించాలి అని పేర్కొన్నారు.అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నాం.పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

కాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో 12 స్థానాలకు తగ్గకుండా పార్టీని గెలిపించుకోవాలి అని కార్యకర్తలకు రేవంత్ రెడ్డి సూచించారు.

తమిళ హీరో అజిత్ రెమ్యునరేషన్ ఆ రేంజ్ లో ఉందా.. ప్రతి నెలా అంత ఇవ్వాల్సిందేనా?
Advertisement

తాజా వార్తలు